Thursday, February 10, 2022

ఒక సాయింత్రం


పార్కుబెంచీపై ఇద్దరు వృద్ధులు
గుప్పెట్లోని పొగడపూలను
ముక్కువద్దకు తీసుకొని
గాఢంగా పీల్చుతూ అన్నారొకరు
"మా అబ్బాయికి వీసా వచ్చిందట"
ఒక్కొక్క పదాన్ని కూడబలుక్కొంటూ
అతని గుప్పెట్లోని పూలను తీసుకొని
దుఃఖ పరిమళాన్ని
గాఢంగా పీల్చుకొంటూ
"అవునా" అన్నాడు మరొకరు
ఆకాశమంతా
నల్లనల్లగా పరచుకొంటోంది
ఒంటరి సాయింత్రం
బొల్లోజు బాబా

2 comments:

  1. ఈ రచనలలో కొన్ని వైరుధ్యాలు కనిపిస్తున్నాయి.

    1) పార్కు బెంచీలపై కూర్చొనే వృద్ధులకు వీసాలు వచ్చే మనవళ్లు ఉండొచ్చు అబ్బాయిలు కాదు.

    2)సాధారణంగా వీసా కోసం తీవ్రంగా తాపత్రయపడేది తల్లి తండ్రులు. వీసా వచ్చిందని బాధపడే వారు అసలు ప్రయత్నం చేయరేమో.

    ఈనాడు ఆదివారం పుస్తకంలో విదేశాలలో పిల్లలు, ఇక్కడ దు:ఖించే తల్లిదండ్రుల కథలు ఎక్కువగా వస్తుంటాయి.

    నిజానికి చాలా వరకు విదేశాల్లో ఉన్న పిల్లలు ఇక్కడ తమ తల్లి తండ్రులను ప్రేమ గానే చూసుకుంటున్నారు. This concept may evoke some sympathy but not close to reality.

    ReplyDelete
    Replies

    1. థాంక్యూ మిత్రమా...

      మీ వాదన సహేతుకంగా ఉంది.
      అంగీకరిస్తున్నాను. సమర్ధించుకొనే ప్రయత్నం చేయను.

      కానీ ఇదొక సమస్య అని గుర్తిస్తారనుకొంటాను.


      Delete