Tuesday, June 1, 2021
Imported post: Facebook Post: 2021-06-01T22:06:24
Rafeef Ziadah - 'We teach life, sir', London, 12.11.11
Rafeef Ziadah We teach life sir
నేడు నా దేహం టీవీలో చూపించే ఒక ఊచకోత
నేడు నా దేహం sound-bites కి పదాల పరిమితికి లోబడి
టీవీలో చూపించే ఒక ఊచకోత
నేడు నా దేహం sound-bites కి పదాల పరిమితికి లోబడి ఉంటూ
సరిపడినన్ని గణాంకాలు కలిగి ఉన్న టీవీలో చూపించే ఒక ఊచకోత.
నేను ఇంగ్లీషు నేర్చుకొన్నాను, నా UN resolutions తెలుసుకొన్నాను
అయినప్పటికీ అతను నన్ను అడిగాడూ...
Ms. Ziadah "మీరు మీ పిల్లలకు ద్వేషాన్ని నేర్పటం నిలిపివేస్తే
పరిస్థితులన్నీ చక్కదిద్దుకొంటాయి కదా" అని
మౌనం...
ప్రశాంతంగా ఉండేందుకు శక్తికోసం నేను నా లోపలకు తొంగిచూసుకొన్నాను
Gaza పై బాంబులు జారవిడిచే సమయాన ప్రశాంతత నా నాలుక చివర ఉండదు
ప్రశాంతత నన్ను విడిచి వెళిపోయింది
మౌనం...చిరునవ్వు
మేము జీవితాన్ని నేర్పుతున్నాం సర్
Ziadah నవ్వుతూ ఉండు
మౌనం..
మేము జీవితాన్ని నేర్పుతున్నాం సర్
వారు మా చివరి ఆకాశాన్ని కూడా ఆక్రమించేసాకా
పాలస్తీనియన్లమైన మేము జీవితాన్ని నేర్పుతున్నాం సర్
మా ఆకాశాన్ని కబళించి ఎత్తైన వివక్షా ప్రహరీలతో వాళ్ళ భవంతులు నిర్మించుకొన్నాకా
మేము జీవితాన్ని నేర్పుతున్నాం సర్
సరే పోనీయండి
ఈ మొత్తాన్ని ఒక కథగా ఎలా చెబుతారు? ఒక మానవ గాథలా?
వివక్ష, ఆక్రమణ లాంటి పదాలు లేకుండా
రాజకీయాలు లేకుండా
కొంచెం సహాయం చెయ్యండి"
నేడు నా దేహం టీవీలో చూపించే ఒక ఊచకోత
Gaza లో ఒక స్త్రీకి అత్యవసర మందులు అవసరపడ్డాయి అనే కథగా చెబుతారా?
మీ సంగతేమిటి?
సూర్యుడిని కప్పటానికి సరిపడా విరిగిన ఎముకల చేతులు ఉన్నాయా మీకు?
చనిపోయిన మీ బంధువుల జాబితా ఇవ్వండి
పన్నెండు వందల పదాల పరిమితికి లోబడి
నేడు నా దేహం టీవీలో చూపించే ఒక ఊచకోత
అది sound-bites కి పదాల పరిమితికి లోబడి ఉంటూ
ఉగ్రవాదుల రక్తానికి స్పందించటం మానేసిన వారిని కదిలించాలి.
కానీ వారు విచారం వ్యక్తం చేసారు
Gaza లో పశువులు మరణించినందుకు విచారం వ్యక్తం చేసారు
వారికి UN resolutions, గణాంకాలు ఇచ్చాను.
మేం ఖంఢిస్తాం, మేం గర్హిస్తాం, మేం తిరస్కరిస్తాం
ఇక్కడ ఇరుపక్షాలు సరిజోడీ కాదు.
ఒకరు ఆక్రమణదారులు మరొకరు ఆక్రమితులు
వందమరణాలు ఒకవైపు, వేయిమరణాలు మరోవైపు
యుద్ధము, ఊచకోత
మేము పరదేశీయులం కాదు, టెర్రరిస్టులం కాము అని ప్రకటిస్తున్నాను
వందల వేల మృతుల్ని పదే పదే లెక్కిస్తున్నాను
ఎవరైనా ఉన్నారా? వింటున్నారా?
ప్రతి ఒక్క శరణార్ధుల శిబిరంలోకి వెళ్ళి అక్కడి ప్రతి ఒక్క శిశువుని ఎత్తుకొని
మరే బాంబు శబ్దాలను వినకుండా వారి చెవులను నా చేతులతో కప్పాలని ఉంది
నేడు నా దేహం టీవీలో చూపించే ఒక ఊచకోత
UN resolutions ఎందుకూ పనికి రాకుండా పోయాయి
నేను ఇంగ్లీషు ఎంతగొప్పగా నేర్చుకొన్నా no sound-bite
And no sound-bite
ఏ sound-bite వారిని బ్రతికించలేదు
ఏ sound-bite దీన్ని బాగుపరచలేదు
మేము జీవితాన్ని నేర్పుతున్నాం సర్
మేము జీవితాన్ని నేర్పుతున్నాం సర్
పాలస్తీనియన్లమైన మేము ఉదయాన్నే నిద్రలేచి
ఈ ప్రపంచానికి జీవితాన్ని నేర్పుతున్నాం సర్
Rafeef Ziadah We teach life sir
Rafeef Ziadah పాలస్తీనియన్ జర్నలిస్టు. పై కవితలో తమ భూభాగాలను కోల్పోయి, తమ సొంత నేలపైనే పరాయి వారిగా బ్రతకాల్సిన దుస్థితి వర్ణించబడింది. తమపై జరుగుతున్న వివక్ష, ఊచకోతలకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటం పై కవితలో కవయిత్రికి, ఆమె సహచర మిత్రునికీ మధ్య జరిగిన సంభాషణా రూపంలో వ్యక్తీకరించబడింది.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment