Wednesday, June 30, 2021
Imported post: Facebook Post: 2021-06-30T11:18:01
33. స్మరణ
పాప వెళిపోయిన రాత్రంతా చీకటి.
అందరూ నిద్రిస్తూ ఉన్నారు.
ఇప్పుడూ రాత్రి చీకటిగా ఉంది. అందరూ నిద్రిస్తూ ఉన్నారు.
“నా చిట్టితల్లీ తిరిగి వచ్చేయి” అని నా పాపని పిలుస్తాను.
తారలు తారలనే చూసుకొంటున్నవేళ నువ్వు ఒక్కసారి వచ్చి వెళితే ఎవరికీ తెలియదులే.
చెట్లు మొగ్గలను ధరించి, వసంతం వికసిస్తున్నపుడు పాప వెళ్లిపోయింది.
నేడు పూవులు విరగపూస్తున్నాయి.
నా చిట్టి తల్లీ తిరిగి వచ్చేయి.
పిల్లలు పూలను విరజిమ్ముతూ ఆటలాడుతున్నారు.
నువ్వు వచ్చి ఓ చిన్న పూవుని త్రుంచినా ఎవరూ కనిపెట్టలేరులే.
ఆనాటి పిల్లలే ఇంకా ఆటలాడుతూన్నారు. జీవితం అలా ఖర్చవుతూనే ఉంది.
వారి అల్లరి కేరింతలు వినబడుతున్నాయి.
నా చిట్టి తల్లీ తిరిగి వచ్చేయి.
ఈ తల్లి హ్రుదయపుటంచుల వరకూ ప్రేమ నిండిఉంది.
నీవు వచ్చి ఓ చిరుముద్దు ఆమె నుండి పొందితే ఎవరూ అడ్డు చెప్పరు.
మూలం: విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ క్రిసెంట్ మూన్ - 33. The Recall
అనువాదం: బొల్లోజు బాబా 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment