1.
పచ్చని చెట్టుమీదకు
ఆకాశం నుండి
తెల్లని కొంగ ఒకటి
కాళ్లని ముందుకు సారించి
రెక్కల్ని లోనికి తీసుకొని
కొమ్మపై వేళ్ళను బిగిస్తూ
బివివి హైకూలా వచ్చి వాలింది
2.
ఏ చెట్టుకొమ్మలకో తగులుకొని
గబ్బిలపు రెక్క పలుచని చర్మం
చిరుగులు పడింది.
నాకు ఆకలిగా లేదు
నువ్వు తినేసి పడుకో అన్నాడతను.
ఏ చెట్టుకొమ్మలకో తగులుకొని
గబ్బిలపు రెక్క పలుచని చర్మం
చిరుగులు పడింది.
నాకు ఆకలిగా లేదు
నువ్వు తినేసి పడుకో అన్నాడతను.
3. Skin Trade
ఒట్టిపోయిన సెక్స్ వర్కరో
పట్టుబడిన నిర్భాగ్యురాలో
ఆమెవరైతేనేం!
సజీవంగానే చర్మం ఒలచబడుతుంది.
విషాదమేమంటే అప్పుడు కూడా
తెల్లతోలుకు విలువెక్కువ
ఒట్టిపోయిన సెక్స్ వర్కరో
పట్టుబడిన నిర్భాగ్యురాలో
ఆమెవరైతేనేం!
సజీవంగానే చర్మం ఒలచబడుతుంది.
విషాదమేమంటే అప్పుడు కూడా
తెల్లతోలుకు విలువెక్కువ
4. సామాన్లు సర్దుతుంటే
పాత ఫోను కనిపించింది
ఆన్ అయింది చిత్రంగా
కంటాక్ట్స్ లో అమ్మ నంబరు
అలాగే ఉంది.
పాత ఫోను కనిపించింది
ఆన్ అయింది చిత్రంగా
కంటాక్ట్స్ లో అమ్మ నంబరు
అలాగే ఉంది.
5.
అన్యధా శరణం నాస్తి... రక్ష రక్ష
యన్న ప్రార్ధన ఆ పెదవులపై
నర్తించి నర్తించి అలసిపోయింది.
దేవుడు తనగదిలో దూరి తలుపు
వేసేసుకొన్నాడు
అన్యధా శరణం నాస్తి... రక్ష రక్ష
యన్న ప్రార్ధన ఆ పెదవులపై
నర్తించి నర్తించి అలసిపోయింది.
దేవుడు తనగదిలో దూరి తలుపు
వేసేసుకొన్నాడు
బొల్లోజు బాబా
ReplyDeleteఆకాశంనుండి తునక
యేకాంతంగా పడింది యెందుకనో పో
యే కాలం వెళుతూ వె
ళ్తూ కాపడ మెట్టుకున్న లుక్కేసిందీ !
జిలేబి
Good afternoon
ReplyDeleteits a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/
వెన్నుపూస పై కాలుపెట్టి కసిగా తొక్కినట్టు అనిపించింది జిలేబి పైకూ పద్యం చదివితే. అదే బివివి హైకూ చదివితే వెన్నపూసలో వేలు పెట్టినట్టు ఉంటుంది.
ReplyDeleteఅవునండి బాగా చెప్పారు
Delete