Siva Racharla gaaru, thank you so much for the surprise and great honour. Feeling very happy.
Bolloju Babaగారు:-
చరిత్రను తవ్వుకుంటూ పోతే అస్థిపంజరాలు తప్ప మరేం మిగలవు.ఏ రాజూ దయాళువు కాదు.అప్పటి పాలనా అవసరాల కోసం ప్రతీ పాలకుడు తన శత్రువులనుకొన్న వారిని ఊచకోత కోయించాడు. చరిత్రనుంచి మనమెలా ఉండకూడదో నేర్చుకోవాలి కానీ పాత బాకీలు తీర్చుకుంటాం అనటం సమంజసం కాదు -- ఇవి బోల్లోజు బాబాగారి వ్యాఖ్యలు.
చరిత్రపట్ల ఇంత నికచ్చి దృక్పథం వుండటం వలన బాబాగారి రచనలతో నేను కనెక్టయ్యాను.
గడచిన మేలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సంధర్భంగా పాండిచ్చేరి గురించి రాస్తు,ఆరాష్ట్రం భౌగోళిఖంగ వివిధ రాష్ట్రాలలో అంటే యానం-ఆంద్రప్రదేశ్,కారకైల్-తమిళనాడు,మాహే-కేరళ తీరాలలో వున్న పాత ఫ్రెంచ్ కాలనీలతో పాండిచ్చేరి ఏర్పడిందని రాసినప్పుడు మిత్రులు ఒకింత ఆశ్చర్యంతో పాటు ఆయా పాంతాలను సరిహద్దు రాష్ట్రాలలో ఎందుకు కలపలేదు అని అడిగారు.నేను క్లుప్తంగా ఫ్రెంచ్ ప్రభుత్వంతో వున్న ఒప్పందాలు అని సమాధానం చెప్పాను.
బొల్లోజు బాబాగారు యానాం వాసిగా యానం చరిత్రను "ఫెంచ్ పాలనలో యానం" పేరుతో సమగ్రంగా పుస్తకాన్ని రాశారు.చరిత్రను తెలుస్కుంటే అలా సమగ్రంగా తెలుసుకోవాలి.అలా తెలుసుకుంటేనే మన ఆలొచనలు పరిపూర్ణత వైపు ఎదుగుతాయి.ఆసక్తి వున్నవారు బాబాగారి యానం పుస్తకం PDFను ఇక్కడ download చెసుకోండి http://kinige.com/book/French+Palanalo+Yanam.
బొల్లోజు బాబాగారు కేవలం చరిత్రకారులే కాదు గొప్ప కవి.కవిత్వం పుస్తకాలు రాశారు,ఎన్నో అనువాదాలు చేశారు."గాధాసప్తమి" మీద అనేక వ్యసాలు రాశారు.
బాబాగారి కవిత్వంలో సామాజిక సృహ ఎక్కువ..."మేకింగ్ చార్జీలు లేవు" అన్న కవిత one of the best,please see photo for poetry.
బాబాగారు వృతిరీత్య Zoology Lecturer.తన వృత్తి గురించి బాబాగారి మాటలు-శాస్త్రీయ దృక్ఫధం అనేది ఒక అలవాటు.దాన్ని పిల్లలలో పెంపొందించటంలో సైన్స్ టీచర్ల బాధ్యత ఎక్కువ.ఇది ఎంత ఎక్కువగా జరిగితే సమాజంలో అంత ఎక్కువ సామరస్యత నెలకొంటుందని నా విశ్వాసం.
తప్పు అని నిరూపింపబడేదే నిజమైన శాస్త్రం,
హంసలన్నీ తెల్లగా ఉంటాయి అని చేసే ఒక ప్రతిపాదన, ఒక్క నల్ల హంస కనపడగానే వీగిపోతుంది.--wonderful sir.
హంసలన్నీ తెల్లగా ఉంటాయి అని చేసే ఒక ప్రతిపాదన, ఒక్క నల్ల హంస కనపడగానే వీగిపోతుంది.--wonderful sir.
చివరగా సందేశంలాంటి ఒక రూమి,
ఇది నీ దారి, నీది మాత్రమే
ఈ దారిపై ఇతరులు నీతో కలిసి నడుస్తారు కానీ
ఎవరూ నీకొరకు నడవరు!
ఈ దారిపై ఇతరులు నీతో కలిసి నడుస్తారు కానీ
ఎవరూ నీకొరకు నడవరు!
బొల్లోజు బాబా సార్,ఫ్రెంచ్ వారి రాకకు ముందు యానం డచ్ కేంద్రం అని నా నమ్మకం.నేను నిరూపించలేను కాబట్టి నమ్మకం అంటున్నాను.కోరమండల్కు యానంకు వున్న సంబంధాలకు ఆధారలు దొరికితే యానం డచ్ వారి పూర్వ కేంద్రం అని నిరూపించవచ్చు.డచ్ వారి వలస కోస్తా తీరంలొ ఉత్తరం నుంచి దక్షిణానికి జరిగింది అనటానికి మాత్రం అధారలు వున్నాయి.
No comments:
Post a Comment