రేవులో కలాసి మధు పడవ లంగరు వేసిఉంది
పడవంతా గోగునార తో నింపారు అనవసరంగా
చాలా కాలంగా అలానే జరుగుతూంది.
అతను తన పడవను నాకు ఇస్తేనా....
దానికి ఓ వంద తెడ్లూ అయిదో ఆరో ఏడో తెరచాపల్నీ బిగిస్తాను
దానిని ఈ పిచ్చి బజారులవైపు నడిపించను
ఇంద్రజాలలోకపు సప్త సముద్రాలు, పదమూడు నదులవైపు నడిపిస్తాను.
అమ్మా! అలా మూల కూర్చొని నాకొరకు బాధపడకు.
రామచంద్రునిలా పద్నాలుగేళ్ళ అనంతరం రావటానికి నేను
అడవులకు పోవటం లేదు కదా!
నువ్వు చెప్పిన కధలో రాకుమారునిలా మారిపోయి
ఇష్టమైన వాటితో నా పడవను నింపుతాను.
నా మిత్రుడు చంటిని కూడా తోడ్కొని వెళతాను.
మేమిద్దరం కలసి ఇంద్రజాల లోకపు సప్త సముద్రాలను,
పదమూడునదులను వేడుకగా చుట్టివస్తాను.
ఉషాకాంతిలో మా ప్రయాణాన్ని మొదలుపెడతాము
మధ్యాహ్నం నీవు కొలనువద్ద స్నానంచేసే వేళకు
మేము మరో ప్రపంచంలో ఉంటాం.
పగడపుదీవులను దాటుకొంటో, మరుగుజ్జు లోకపు
రేవులమీదుగా ముందుకు సాగుతాం.
మేం తిరిగి వచ్చేసరికి చీకటి పడుతుంటూంది.
మా ప్రయాణపు వింతలు విశేషాల్ని నీకు చెపుతాను.
అతను తన పడవను నాకు ఇస్తేనా....
ఇంద్రజాలలోకపు సప్తసముద్రాలను, పదమూడు నదులనూ
వేడుకగా చుట్టివస్తాము.
(మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Sailor గీతం)

చాలా బాగుంది సార్ అనువాదం..మూలం చదవలేదు...మీ అనువాదం నా లోలోపల స్పృశించింది..
ReplyDeleteబాబాజీ ! చాలా కాలం తరువాత ,కుమార్ వర్మ గారి ద్వారా మీ సాహిత్యపు జల్లులలో తడిసే భాగ్యం కలిగింది. ఎలా వున్నారు?...శ్రేయోభిలాషి ...నూతక్కి.రాఘవేంద్ర రావు.(కనకాంబరం )
ReplyDeleteకలల్లొకి పయనించాలని అందరికి కల ఉంటుంది.అది దీనిలొ చాలా బాగా
ReplyDeleteప్రతిబింబించారు