వెబ్ లో వెతుకుతూంటే చాన్నాళ్ళ క్రితం ఓ బ్లాగులో చేసిన ఓ కామెంటు కనపడింది. బాగున్నట్టనిపించి ఇక్కడ పంచుకొంటున్నాను. పూర్ణిమ గారికి ధన్యవాదములతో........
Your absence has gone through me
Like thread through a needle.
Everything I do is stitched with its color.
– W.S. Merwin
పై కవితకు అనుసృజనగా నే వ్రాసిన కొన్ని రూపాలు
1.నీవియోగం నన్ను చీల్చుకొంటో పోయింది.
పూమాలలోంచి దారంలా
నా హృదయం నిండా నీజ్ఞాపకాల పరిమళాలే.
2. నీవు లేని ఆ క్షణం ఒక దారమై
నా మనసనే సూది గుండా దూసుకుపోయి
నా ప్రతి ఆలోచనకూ నీవర్ణాన్నే అద్దుతోంది.
3.దారానికి సూది వేలాడినట్లుగా
నీ వియోగానికి నా హృదయం వేలాడుతోంది.
ఎంత ప్రయాణించినా నీ వృత్తంలోనే నడకలు.
ఆ పాత పోస్టు లింకు ఇక్కడ
http://pisaller.wordpress.com/2008/12/21/separation/
బాబా;
ReplyDeleteఇది నాకు చాలా ఇష్టమయిన కవిత.
మీ అనువాదంలో కవిత్వీకరణ కొంచెం ఎక్కువయిందేమో?!
నా దృష్టిలో ఈ కాలం కవిత్వం "ఆకవిత్వీకరణ" వైపు వెళ్తోంది. ఈ ముచ్చటయిన మూడు పంక్తులలో కూడా మెర్విన్ చేసిన పని అదే అనుకుంటాను.
ఇలా చెయ్యవచ్చేమో చూడండి. ఆ మాటకొస్తే, అనువాదం అనేక రకాలుగా చెయ్యవచ్చు. అనువాదకుడి స్వేచ్చని నేను ముమ్మాటికీ గౌరవిస్తాను. అందుకే అనుసృజన అనే పదం కూడా వాడుతున్నాం. ఇక్కడ నేను చేస్తున్నది వొకానొక పద్ధతి మాత్రమే.
Your absence has gone through me
Like thread through a needle.
Everything I do is stitched with its color.
నువ్వు లేని తనం నా లోంచి దూసుకుపోయింది
సూదిలోంచి దారంలాగా.
నేను చేస్తున్నదల్లా దాన్ని రంగులతో కుట్టడమే!
నాకేదో కవిత్వాన్ని గురించి తెలుసునని కాదుగానీ, మూలంలో ఉన్న ఒక చిక్కని భావం ఇక్కడ వేసిన నాలుగు అనుసృజనల్లోనూ వెలికిరాలేదు.
ReplyDeleteకొన్నాళ్ళ క్రితం, కనీసం ఆరు పంక్తులయినా లేకపోతే దానిని "కవిత" గా అంగీకరించనన్న బాబా గారు మనసు మార్చుకొన్నట్టున్నారే!
ReplyDelete"పై కవిత" అని మూడు పంక్తుల stray thoughts (బాబా గారే అన్న మాట సుమా!)ని అనడం, పైగా అనువాదంలో మూడు పంక్తుల్లోనే మరింత కవిత్వీకరించే ప్రయత్నం చేయడం చూస్తుంటే, ఇప్పటికి గాని కవితా శక్తికి పంక్తుల సంఖ్యతో పని లేదన్న సత్యాన్ని గుర్తించారని తెలుస్తోంది.
గురువుగారు అఫ్సర్ గారికి, కొత్తపాళీ గారికి
ReplyDeleteథాంక్యూ సర్
నా దృష్టిలో ఈ కాలం కవిత్వం "ఆకవిత్వీకరణ" వైపు వెళ్తోంది.
కరక్ట్ సర్. ఈ మధ్యకాల కవిత్వాన్ని గమనిస్తూంటే నిజమే ననిపిస్తూంది.
నేనిచ్చిన లింకులో భైరవభట్లగారి అనువాదం (నీ వెలితి
సూదిలో దారంలా నాలోంచి దూసుకుపోయింది.
ఇక నా ప్రతీ చేష్టలో
ఆ రంగే అల్లుకుంటుంది) చూసే ఉంటారనుకొంటున్నాను.
ఇక ఈ కవిత విషయానికి వస్తే.....
మూలంలో ఉన్నits color అన్న భావాన్ని తెలుగులో పెట్టటానికి వీలవటం లేదు. ఇంగ్లీషులో ఉన్న క్లుప్తత (అంటే ఆ దారం రంగులో నా చేష్టలన్నీ ఉంటున్నాయి) తెలుగులో ప్రయత్నిస్తే కృతకం గా అనిపిస్తుంది. ఇక పోతే సూదీ దారం అనే ఉపమానం కూడా కవిత్వ భాషకు (?) పొసగని విషయంలా అనిపిస్తుంది.
కానీ సూదీ దారం, ఆ దారం రంగు అనే విషయాలే మూలానికి బలమైన అభివ్యక్తిలు. అందుకనే కొత్తపాళీగారికి మూలంలోని ఫోర్స్ రాలేదనిపించి ఉండొచ్చు.
భవదీయుడు
బొల్లోజు బాబా
@ ఫణీంద్ర గారు పాత పగలింకా మరచినట్లు లేదు. :-))
ReplyDeleteమరోసారి అఫ్సర్ గారే అనువాదం చేస్తే నో ,
ReplyDelete""నా దృష్టిలో ఈ కాలం కవిత్వం "ఆకవిత్వీకరణ" వైపు వెళ్తోంది."" అనే వాటికి కొంచెం విపులంగా రాస్తే?...
నాయుడు గారికి
ReplyDeleteనమస్తే
ఇక్కడ అకవిత్వీకరణ అంటే పదచిత్రాలు, అలంకారాలు, పదాల పొహళింపు గంభీరమైన వాక్య నిర్మాణాలు వంటి హడావిడిలేకుండా సరళంగా గా, పదునుగా, ఆలోచనాత్మకంగా ఉండే కవిత్వం నేడు ఎక్కువగా వస్తుందని నాకనిపిస్తూంది. బహుసా అదే అభిప్రాయాన్ని అఫ్సర్ గారు వెలిబుచ్చారని భావించాను.
నేను ముందుగానే చెప్పిన కారణాల వల్ల ఈ కవిత నాకు అనువాదానికి లొంగలేదు. (లేదా నేచేసిన అనువాదం నా కే నచ్చలేదు)
అఫ్సర్ గారు చేసిన అనువాదం బాగుంది.
@ ఫణీంద్రగారు నా బ్లాగును సందర్శించినందుకు ధన్యవాదాలు. పై కామెంటు సరదాగా చేసింది. స్మైలీ గమనించగలరు.
బొల్లోజు బాబా
అసంధర్బమే ...గానీ...మీరూ చదువుతారనీ ...
ReplyDeletehttp://www.tehelka.com/story_main49.asp?filename=hub230411There.asp
బాబా గారు!
ReplyDeleteనేను ఏనాడయినా విషయం పైనే చర్చిస్తాను. మీరే ఇంకా వ్యక్తిగతంగా ఆలోచించడం మాననట్టుంది.
నా కామెంట్ కూడా ఆనాటి మన విషయ చర్చ పైనే అని గ్రహిస్తారనుకొన్నాను.
ఏమైనా నేను మీ కవిత్వీకరణ శక్తికి అభిమానిని. అందుకే మీ బ్లాగును అప్పుడప్పుడూ చూస్తుంటాను.
ఇకనైనా నన్ను సాహితీ మిత్రునిగా కాకపోయినా మీ అభిమానిగానైనా చూడండి సార్!
@ ఫణీంద్ర గారికి
ReplyDeleteమీకు నేనిచ్చేది మిత్ర స్థానం కాదు. మీరు నాకు గురుసమానులు.
చందోబద్దమైన కవిత్వ విషయంలో మీ పాండిత్యం అపారం. మీ సంగీత సాహిత్య మేధ అసమాన్యమైనది. ఆ విషయంలో మీకు పాదాభివందనం చేయటానికి నేనేనాడు సంకోచించను.
ఇక మన వాగ్వివాదానికి సంబంధించి మీరెప్పుడైతే నన్ను "మీరెందుకు స్ట్రే బర్డ్స్ అనువాదం చేసారని" అడిగారో అప్పుడే నా వాదన వీగిపోయిందనిపించింది.
నేను చేతులెత్తేసానన్న విషయం మీకర్ధమైందని నేను భావించాను.
సదా
నమస్సులతో
బొల్లోజు బాబా
బాబా గారు!
ReplyDeleteమీ సహృదయతకు ధన్యవాదాలు!
మన మైత్రి బలపడు గాక!
ఈ అనువాదాలు చూసిన తర్వాత నాకు కూడా అనువదించాలన్న చపలత్వం కలిగింది.
ReplyDeleteనీ వెలితి
సూదిలోనుండి దారంలా నాలోంచి చొచ్చుకుపోయింది.
ఇక నా చేతలన్నీ, ఆ రంగు అల్లికలే.
ns మూర్తి