Wednesday, July 14, 2010

ప్రార్ధన


ఇప్పుడిక ఓ ఎడారిని ప్రసాదించు 

వర్షించే ఇసుకా, ప్రవహించే ఎండా
దిగంతాలవరకూ
పరచుకొన్న ఏకాంతం
నిర్జల సరోవరాల తో కూడిన
ఓ ఎడారి కావాలిపుడు.
దానికేమాత్రం తగ్గినా
ఈ ఘడియ రక్తికట్టదు.


లేదా
ఓ సముద్రాన్నిప్పించు
దేహాన్ని తేల్చుతూ ఉండేంత ఉప్పని నీరు
చుట్టూ విశాలంగా విస్తరించిన ఏకాంతం
కింద వెచ్చని బడబాగ్ని
పైన చల్లని సుడిగాలులతో కూడిన
ఓ ఉప్పని సముద్రమైనా చాలు
సరిగా సరిపోతుంది.

లేక పోతే 

ఓ రాత్రిని అనుగ్రహించు
అన్ని వైపుల్నుంచీ వీచే నల్లని గాలి
మువ్వలచేతికర్రతో సాగే నేత్రధ్వయం
స్పటికం లా వణికే  చిక్కని నీలిమా
పొదలమాటున మెరిసే కనుల ఏకాంతంతో కూడిన
రాత్రయినా చాలు సందర్భోచితంగా ఉంటుంది.

లేదా.........






బొల్లోజు బాబా

2 comments:

  1. ఆవరించుకుంటున్న శూన్యాన్ని చేదించేందుకు చేసిన ప్రార్థనగా అర్థమయ్యింది. Am I right?

    ReplyDelete
  2. కె క్యూబ్ గారికి
    తాంక్యూ సార్

    ఛేదించటానికి కాదు రక్తి కట్టించటానికి.........

    ReplyDelete