Thursday, June 25, 2009

ప్చ్


బలాన్నంతా కూడదీసుకొని
దూరంగా విసిరేసిన ఓ స్వప్నం
మెల్లమెల్లగా కనుమరుగైంది
ఎగిరే పక్షికూతలా.

అక్కడ ఆ చీకటి చలిలో
అదిచేసే దుర్భల ఆర్తనాదం
లీలగా వినిపిస్తోంది.
లేదు అవును లేదు అవును అవును.
అవును అదింకా నన్ను ప్రేమిస్తూనే ఉంది.

ఎపుడో ఒకప్పుడు
అది ఓ రెక్కల గుర్రమై
ఎగురుకుంటూ వచ్చి
నన్నెక్కించుకొని
ఆ కొండపై దింపుతాది.

అప్పటికి ఈ ప్రపంచం
ఇంకా లోయలోనే ఉంటుంది.

బొల్లోజు బాబా

10 comments:

  1. బాగుంది. మళ్ళీ మళ్ళీ చదివాను.

    ReplyDelete
  2. అద్భుతం. చివరి రెండు వాక్యాలూ అత్యద్భుతం.

    ReplyDelete
  3. ఆహా బాబా గారు ఎంతకాలానికి...
    చాలా బాగుంది...

    అసలే స్వప్నం..పైగా.. చీకటి, చలి,
    దూరం తాళలేక అది చేసే ఆర్తనాదం..
    పైగా.. రెక్కల గుర్రమవడం,
    మీతోసహా.. కొండ శిఖరాలు చేరడం..

    అబ్బో విఠలాచారిగారి సినిమా చూస్తున్నట్టుంది.

    ReplyDelete
  4. కొస మెరుపు ప్చ్‌...
    ఆ ప్చ్‌.. అది జరగదనా ?
    ఇంకా ఎంతకాలం ఇలా అనా ?

    మంచి ఫీలు ఉంది బాబా గారు.
    అభినందనలు

    ReplyDelete
  5. చాలా బాగుందండి.అభినందనలు.

    ReplyDelete
  6. అప్పటికి ఈ ప్రపంచం
    ఇంకా లోయలోనే ఉంటుంది.

    wow... బాబా గారు ... so coooool

    ReplyDelete
  7. చందమామ కధలోనే కాదు మీ కలలో కూడా రెక్కల గుర్రాలుంటాయన్న మాట ! బావుందండీ ...

    ReplyDelete
  8. స్పందించిన అందరకూ అనంతానంత ధన్యవాదములండీ.

    థాంక్యూ
    బొల్లోజు బాబా

    ReplyDelete
  9. బాబా గారూ చాలా రోజులయ్యింది . క్షేమమని నా ఆకాంక్ష. మీ విరచిత 'ప్చ్' పలుమార్లు నా చేత చదివిన్చుకొన్ది. ఓ మంచి వ్యక్తీకరణ .అభినందనలు

    ReplyDelete