Thursday, March 5, 2009

ఫ్రాగ్మెంట్స్

1. గిల్టీ

బండి చక్రం క్రింద
తొండ పడింది
చూస్తూండగానే
దాన్ని గద్ద తన్నుకుపోయింది.
అయిదేళ్ళ మా పాప కళ్ళల్లో
కళ్ళు పెట్టి చూడలేకున్నాను.

****************



2.
దేవుని పటానికి
ప్లాస్టిక్ దండ.
ఎన్నటికీ వాడని
కోపం.

************



౩.

వర్షం వెలిసింది
పక్షులు ఇంకా
ధ్వనించటం లేదు.


౩.
రోడ్డుపై
పేడేరుకొనే పిల్లగాని చమట
కుండీలో
గులాబీల్ని పూయించింది.


4.

వసంతం చివరి రోజున
జన్మించిన సీతాకోక చిలుక
చీమలకు చిక్కింది.
ఇంద్రధనస్సు చచ్చిపోయింది.


బొల్లోజు బాబా

10 comments:

  1. బావుందండీ !నిత్యం మనలో కలిగే అంతర్మధనం చిన్న పదాల్లో చెప్పారు .

    ReplyDelete
  2. పండుగరోజనో పుట్టినరోజనో పుణ్యం చేద్దామనుకుంటే సమయానికి సాదుజంతువులు, బిక్షకులు కూడా కరువైన వైనం. మీరన్న ఫ్రాగ్మెంట్స్ చాలా కనబడుతున్నాయి జీవితంలో. ఇంకా కాలంలో ఎన్నిచూడాలో ఇలా..
    చక్కగారాసారు గురువుగారు.

    ReplyDelete
  3. కాలమే గొప్ప గురువు

    శిష్యులందరిని

    చివరి మజిలీకి

    సాగనంపు

    ReplyDelete
  4. రోడ్డుపై
    పేడేరుకొనే పిల్లగాని చమట
    కుండీలో
    గులాబీల్ని పూయించింది.

    wow... you keep on using your 'sweet poistion' on us. excellent...Baba garu.

    ReplyDelete
  5. బాగుందండి.వెరీ నైస్.

    ReplyDelete
  6. ఇప్పుడు ఈ చిన్ని కవితలు చదువుతుంటే ఒకటి అనిపిస్తుంది... వీటిలో ఎంతో అనుభవ సారం ఉంది, మన ఆలోచన పరిధిని పెంచే శక్తి ఉంది... కొనసాగించండి...

    ReplyDelete
  7. మిత్రులారా
    స్పందించిన సహృదయులందరకూ ధన్యవాదములు.

    పరీక్షల హడావుడి కారణంగా ఈ మధ్య ఈ వైపుకే రాలేకుంటిని. మన్నించండి.

    భవదీయుడు

    బొల్లోజు బాబా

    ReplyDelete
  8. "వసంతం చివరి రోజున
    జన్మించిన సీతాకోక చిలుక
    చీమలకు చిక్కింది.
    ఇంద్రధనస్సు చచ్చిపోయింది."

    చాలా బాగుంది!!

    ReplyDelete