ఒక వేకువ
కోడి కూసింది
ఈకల మెరుపు
ఆకాశానికి విస్తరించింది.
చుక్కల్నీ చంద్రుణ్ణీ
చంకనేసుకొని రాత్రి
చల్లగా జారుకుంది.
పారిజాతం పూల
ఎర్రెర్రని గొట్టాల్లోంచి
ఎట్టకేలకు ఉదయసంధ్య
విడుదలైంది.
నిద్రగన్నేరు చెట్టు
ఆకుల పిడికిళ్లను తెరచి
కిరణాల గింజల్ని
ఏరుకోవటం మొదలెట్టింది.
బొల్లోజు బాబా
మీ కవిత చాలా బాగుంది. ఇటువంటి అందమైన కవితలను చందోబద్ధం చేయగలిగితే ధారణకు అనుకూలంగా ఉండి శాశ్వతత్వం సంతరించుకుంటాయని ఎందుకో నా కనిపిస్తుంటుంది.
ReplyDeleteబాబాగారు..... చూసారా! మీ కవితకి హైదరాబాద్ నగరం నిన్నటి వరకు ఎండకాచి ఈరోజు చల్లబడింది.
ReplyDeleteపారిజాతం పూల
ReplyDeleteఎర్రెర్రని గొట్టాల్లోంచి
ఎట్టకేలకు ఉదయసంధ్య
విడుదలైంది.
నిద్రగన్నేరు చెట్టు
ఆకుల పిడికిళ్లను తెరచి
కిరణాల గింజల్ని
ఏరుకోవటం మొదలెట్టింది.
బాబా గారు, మొత్తం రాయకముందే పబ్లిష్ చేసే సాను. ఈ లైన్లు చదువుతుంటే ఆ దృశ్యాన్ని విజువలైజ్ చేసుకోవాలనిపించింది.
ReplyDeleteనిద్రగన్నేరు చెట్టు
ReplyDeleteఆకుల పిడికిళ్లను తెరచి
కిరణాల గింజల్ని
ఏరుకోవటం మొదలెట్టింది.
చాలా బాగా రాసారు
beautiful
ReplyDeleteబాబా గారు, నాకు మా ఊరి సముద్రానికి వేకువ జామునే వెళ్లి "కిరణాల గింజల్ని" (ఆ రాత్రి కి కొటుకొచ్చిన ఆలు చిప్పలు) ఏరు కోవాలని వుంది.
ReplyDeleteచాలా బాగుంది
బాబా గారూ చాలా బాగుందండీ.. అపుడెపుడో నా నిద్ర కళ్ళలో నుండి తూర్పుజారిన సింధూరాలిప్పుడు పారిజాతపు ఎర్ర గొట్టాలలో దాగున్నాయన్నమాట. మంచి కవితాచిత్రాన్ని ఆవిష్కరించారు. మీరిమెచ్చిన ఆ కవిత ఇదిగోండి. :-)
ReplyDeletehttp://aatreya-kavitalu.blogspot.com/2008/12/blog-post_06.html
wow................!!!!!
ReplyDeletewonderful
అద్భుతమైన భావ వ్యక్తీకరణ,
ReplyDeleteకవిత్వంలొ సంక్ష్ప్తీకరణ హైకూ లక్షణాలను ఇముడ్చుకున్నట్లనిపిస్తుంది.
ఆబ్ స్ట్రాక్టిక్ గా ఉంది.
శుభాకాంక్షలతొ
ఈగ హనుమాన్
మిత్రులు మన్నించాలి ఆలస్యంగా బదులిస్తున్నాను.
ReplyDeleteనరసింహ గారికి
మీ సూచనకు ధన్యవాదములండీ.
పద్మార్పిత గారు
అవునా. :-)
సుజాత గారు
థాంక్సండీ.
నేస్తంగారు, కొత్తపాళీగారు
స్పందించినందుకు నెనర్లండీ.
రమేష్ గారు
అలానే కానివ్వండి. వీలైతే ఫొటోలు మీ బ్లాగులో పెట్టండి. మేమూ చూస్తాం.
ఆత్రేయగారు
కదూ!
రెండు కవితలూ దాదాపు ఒకే థీం కదూ.
జాన్ హైడ్ గారు
థాంక్సండీ
హనీ గారూ
క్లుప్తతలో మాంచి పట్టున్న మీరు మెచ్చుకోవటం ఆనందంగా ఉంది.
అదరహో! ఇలాంటి వర్ణనలు మీకెలా వస్తాయండీ బాబూ???
ReplyDeleteఆహా! ఈ వేకువ నాకు కావాలీఈఈఈ...
ReplyDeleteకామేశ్వరరావుగారూ
ReplyDeleteనావల్లకాదు, ఇక్కడే ఎవరో అవుల్రడీ నొక్కీసారు :-)