Monday, March 30, 2009

ఫ్రాగ్మెంట్స్ 2

1.

పావుగంటగా ఆలోచనలేమీ లేవు
యవ్వనం ఫోల్డర్ ఓపెను చేసా!
నీ పరిమళం చుట్టుముట్టింది.

*******

2.

కోరికకు సాఫల్యానికి
మధ్య అగాధం.
చితిలో ఇంకా నిప్పుంది.
పోరాడాల్సిందే!
*******


3.

నిన్నటి రోజాలు
ఎక్కడకు పోయినయ్?
కుసుమం వికసించటంలోనే
దాని చావుంది.
*******


4.

భాయ్
నేను చెప్పే ఈ విషయాన్ని
ప్రపంచం నమ్మటంలేదు.
మనిద్దరం ఒకే వేర్లని కలిగి ఉన్నాం.
********

5.

నగ్న తరువులు --
పత్రాల, పుష్పాల దుస్తులు లేవు.
వసంతం వస్తోంది.

బొల్లోజు బాబా



8 comments:

  1. హ్మ్ చాలా బరువుగా ఉన్నాయి.

    ReplyDelete
  2. బొల్లోజు గారు,
    మీ ఫ్రాగ్మెంట్స్ లిఫాఫా ఓపెన్ చేసి చూసా, కమ్మని కవిత్వ పరిమళం. అదేంటొ గాని చక్కని కవిత్వాన్ని చదివినప్పుడు, నా భావాన్ని కొందరితోనన్నా పంచుకోంది నేనుండలేను, మా దగ్గరున్న కవి మిత్రులతొ మీ ఖండికలని షేర్ చేసుకున్నాను, అందరు మీకు అభిందనలు తెలియచేసారు, అందుకోండి మిత్రమా!!
    మీ కవి మిత్రుడు
    ఈగ హనుమాన్

    ReplyDelete
  3. బాగున్నాయి,బరువుగా కూడా ఉన్నాయి సార్.

    ReplyDelete
  4. నాకు రెండవది అర్థం కాలేదు. మిగతావన్నీ బావున్నాయి . కొంచం అర్థం చెప్పరూ!

    మీ స్టైల్ నాకు చాలా నచ్చింది. నాకూ ఇలా రాయాలనిపించింది. మీ పర్మిషన్ లేకుండా స్టైల్ ని వాడుకున్నాను మన్నించాలి.

    ReplyDelete
  5. wonderful babagaru! really superb!

    ReplyDelete
  6. బాబాజీ!!
    మీరు నామధేయం చేసినట్లు, ఖశ్చితంగా వీటిని శకలాలే అనాలి, ఎందుకంటే ఇవి రాస్తున్నప్పుడు మీ ఉద్దేశం వేరు, ఒక దీర్ఘ కవితలో ఇవి కొన్ని పాదాలు మాత్రమే, ఔను కదా. కానీ నానోలు అలా కాదు, ఆ రూపం లో మత్రమే రాయాలని సంకల్పించుకుని, కల గని, తహతహలాడి రాసినై గనుక, శిల్పం లో తేడా ఉంటుందని నా అభిప్రాయం మిత్రమా!!
    మీ సృజనని అభినందిస్తు..
    మీ
    ఈగ హనుమాన్

    ReplyDelete
  7. పరిమళం గారికి
    ధన్యవాదములండీ.

    మహేష్ గారు బరువుగా ఉన్నాయా? :-)

    హనీ గారూ
    చాలా చాలా ధన్యవాదములండీ. మీ ప్రొఫైల్ చూసాను. మీరు తెలుగు సాహిత్యంలో మీకున్న స్థానాన్ని తెలుసుకొన్నాను. మీవంటి పెద్దలకు నా రాతలు నచ్చటం, దానిని ఏ భేషజాలు లేకుండా మెచ్చుకోవటం చాలా ఆనందాన్ని కలిగించింది.

    ఇక మీ రెండవకామెంటులోని పరిశీలన కరక్టే నండీ. మీ నానోలు లేదా హైకూలు, నానీల ప్రధాన ఉద్దేశ్యం క్లుప్తత, ఆ చిన్న గుప్పిటలోనే ప్రపంచాన్ని చూపించాలన్న ప్రయత్నం కనపడుతుంది. కానీ ఈ ఫ్రాగ్మెంట్స్ యొక్క ఉద్దేశ్యమూ అదికాదు, లిటరల్ గా కూడా ఇవి శకలాలే. ఇదే విషయాన్ని ఆవకాయ్.కాం లో జరిగిన ఒక చర్చలో ఇలా అన్నాను. గమనించండి.

    బాబాజీ?
    ఇవన్నీ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ అన్ ఫినిష్డ్ ఐడియాస్ అని అనుకోవచ్చును కదా
    -- Alok Vastav, Jan 4 2009 9:54

    అలోక్ గారికి
    ఏదో వ్రాయాలని, ఆలోచనలు తెగక మిగిలిపోయినవి కొన్ని, ఏదో వ్రాసేసిన తరువాత ఎడిటింగులో తొలగించినవి కొన్ని ఇలాంటివి నా డైరీల్లో చాలా మూలుగుతున్నాయండీ

    పేరు లోనే చెప్పేసాను కదు సారూ, ఇవి ఫ్రాగ్మెంట్స్ అని. ఇవి శకలాలే. పద్యాలవో, ఆలోచనలవో, పదచిత్రాలవో మీరెలా అనుకొంటే అలానే
    :-)
    -- బొల్లోజు బాబా, Jan 5 2009 11:41AM

    మరెందుకు అలాంటి శకలాలని ముందుకు తెస్తున్నారని అనుకోవచ్చు. వాటిలో కొన్నింటిని విడిగా చదువుకున్నా ఒక చమత్కారమో, లేక ఒక పదచిత్రమో లేక ఆలోచనో ఆవిష్కరింపబడుతుందన్న నమ్మకం వలననే.

    దీనికంటూ ఒక ప్రత్యేకమైన శిల్పమేమీ లేదు. నియమాలంతకన్నా లేవు. సోమసుందర్ గారన్న "రాలిన ముత్యాలు" వంటివి ఇవి. (ముత్యాలో లేక మట్టి బెడ్డలో :-) అనేది వేరే విషయం అనుకోండి)

    మీ పరిశీలనకు కృతజ్ఞతలు.

    నరసింహ గారూ
    మీకు శ్రీరామ నవమి శుభాకాంక్షలండీ.

    వాసు గారు,
    రెండవదానిలో ఒక జీవితం ఎంతగా వైఫల్యం చెందినా, పోరాడకతప్పదు అనే ఒక కోణాన్ని చెప్పయత్నించానండీ.
    కోరికకు సాఫల్యానికి మధ్య అగాధం అంటే, కోరికలేమీ నెరవేరలేదు, ఆశకీ త్అందుకొన్నదానికీ మధ్య చాలా దూరం ఉంది అని నా భావన.
    అయినప్పటికీ పోరాడాల్సిందే కదా. అక్కడే ఏడుస్తూ కూర్చోకూడదు కదా. చితిలో నిప్పు అంటే ఇంతిలా కాలిపోయిన జీవితంలో కాస్తో కూస్తో ఉన్న ఆశో/ఓపికో/నమ్మకమో/ప్రాణమో మీరెలా అనుకొంటే అలానే.
    ఇప్పుడే మీ బ్లాగు చూసాను. మీ తునకలు చాలా బాగున్నాయి. కంటిన్యూ చేయండి.
    మీరు ఈ బ్లాగులు చూసారా. వాటిలో చిన్న చిన్న పదాలతో, వాక్యాలతో సృజియింపబడ్డ చక్కని పదచిత్ర మెరుపులు కనిపిస్తాయి.
    http://etiodduna.blogspot.com/
    http://nanolu.blogspot.com

    గిరీష్ గారూ థాంక్సండీ

    బొల్లోజు బాబా

    ReplyDelete