Sunday, October 19, 2008
ఒకానొక రెడ్ లైట్ ఏరియా
ఆ నాలుగు రోడ్ల కూడలి
పరాకాష్టకు చేరుకున్న ఒకానొక
వికృత క్రీడ యొక్క భీభత్సావృత కూపం.
జీవితం లైంగికంగా వ్యాప్తిచెందే
అంటురోగమయిన చోట
కన్నెలు మల్లెలవుతాయి
మల్లెలు కత్తులవుతాయి.
ఇక్కడ స్త్రీ చర్మం గజాల్లెక్కనా
గంటల్లెక్కనా వ్యాపారం చేయబడుతుంది.
ఇక్కడ అసూర్యంపశ్యల మాంసం
దేహాల్లెక్కన వడ్డీకి తిప్పబడుతుంది.
వర్ణ, వర్గ, కుల, మతాలనబడే
సభ్యసమాజపు శిలాతెరలు ఇక్కడ
దేహాలమద్య కనిపించని మంచుపొరలవుతాయి.
కిలికించితాలు, చెక్కిళ్ళ సిగ్గుదొంతరలు,
సుఖమనిపించే విరహాలు, పరిష్వంగ పులకింతలు,
అవన్నీ ఇక్కడి ఈ జీవన పరాజితుల
గుండెల్లో కలల శిలాజాలు.
ముత్యం భస్మమయినట్లు
స్వప్నయవ్వనం కాలిపోగానే, వాస్తవం
అనకొండాలా మృత్యుకౌగిలించుకుంటుంది.
పింప్ లు పిండుకోగా ఈ స్థనాల్లో
మిగిలింది రక్త గడ్డలొక్కటే.
నిత్యం వందల డైనోసార్ పందుల
రత్యానంతరం ఈ దేహాల్లో మిగిలింది
రోదనా ప్రవాహమొక్కటే.
ఈ కసుగాయల చెక్కిళ్లు చిదిమితే
కారేది పాలు కాదు ఎయిడ్స్ మాత్రమే.
ఈ ఎడారి కొమ్మలు పుష్పించేదిక
వేదనా బూడిద మాత్రమే.
ప్రపంచ ప్రాచీన వృత్తి ఇక్కడి
వ్రణ యోనులకు జీవనాధారమై
అదే మృత్యుదాతయై విరాజిల్లుతుంది.
సమాన ఆస్తి హక్కు, 30% రిజర్వేషన్ల వల్ల ఏం లాభం?
జీవన పరిస్థితులు మెరుగుపర్చాలి కానీ?
బొల్లోజు బాబా
(ఒకానొక రెడ్ లైట్ ఏరియా చూసి చలించి)
Subscribe to:
Post Comments (Atom)
కదిలించిందండీ ఈ కవిత. జీవన పరాజితుల గుండెల్లో కలల శిలాజాలు, ప్రయోగం ... చక్కగా, పవర్ ఫుల్ గా ఉంది. సామాజిక నిజాలను (Social realities) వ్యక్తపరిచారు. చాలా బాగుంది.
ReplyDeleteవారి కన్నుల చాటుమాటున దాగిన కన్నీటికి విలువ కట్టగలిగేదెవ్వరు?
ReplyDeleteఆసాంతం కదిలిచేదిలాగుంది.
"ముత్యం భస్మమయినట్లు
ReplyDeleteస్వప్నయవ్వనం కాలిపోగానే, వాస్తవం
అనకొండాలా మృత్యుకౌగిలించుకుంటుంది."
ఆ మృత్యు కౌగిలే వారికి ప్రశాంతతని ఇస్తుందేమో????
అన్నట్టు "అసూర్యంపశ్యల" అంటే అర్ధం చెప్పరూ ??
ఈ ఎడారి కొమ్మలు పుష్పించేదిక
ReplyDeleteవేదనా బూడిద మాత్రమే.
కదిలించారండి.
బావుంది.
ReplyDeleteఅసూర్యంపశ్య అన్న పదం వాడటం ironic and very appropriate!
చాలా బాగా రాశారు. సినిమాల్లో చూసినట్టుండదు వేశ్య జీవితం. హారిబుల్ హారిబుల్ జీవితం అది. మీరు నిజంగా చాలా బాగా రాసారు బాబా గారు.
ReplyDeleteశివ గారూ
ReplyDeleteథాంక్యూ ఫర్ షేరింగ్ ది పెయిన్ సర్
శశి కాంత్ గారూ,
స్పందించినందుకు నెనర్లండీ.
కలగారూ,
నిజమేనండీ. వెల ఎవరూ కట్టలేరు.
లచ్చిమి గారూ,
బహుసా అంతే నేమో!
అసూర్యంపశ్యలంటే ఎండ కన్నెరుగని స్త్రీలని అర్ధం అండీ. తెరెసాగారి వివరణ చూడగలరు.
అనంతంగారూ
అవునా? గొప్ప కాంప్రహెన్సివ్ గా ఒకే అంశం పై భిన్న కోణాలలో వ్రాసే మిమ్మల్ని కదిలించగలిగానా? థాంక్సండీ.
తెరెసా గారికి
చాలా చాలా ధన్యవాదములండీ. మీరిలా విచ్చేసి అభినందించటం ఇంకా ఆనందంగా ఉందండీ.
సుజాత గారికి
ఈ కవిత చాలా కాలం క్రితం పెద్దాపురం అనే ఊరిలో నవోదయాలో పనిచేసే రోజుల్లో వ్రాసినదండీ. అక్కడ పనిచేస్తున్న రోజుల్లో సాయింత్రం పూట కొంతమంది కలసి టీ తాగటానికై అలా బజార్లోకి వెళ్ళే వాళ్ళం. ఆ దారిలో ఇటువంటి కొన్ని ఏరియాలను దాటుతూ వెళ్ళే వాళ్లం. అక్కడ పింప్ ల పరిస్థితి ఎలా ఉండే దంటే " మేము ఇక్కడి వాళ్లమే, బయటనుంచొచ్చిన సందర్శకులం కాము అని వారికి తెలియటానికి సుమారు రెండునెలలు పట్టింది" అంతలా అక్కడ పరిస్థితులు ఉండేవి. అప్పట్లో వ్రాసుకొన్నకవిత ఇది. అలాంటి ప్రదేశాలు ఈ భూమిపై కోకొల్లలు. ( అఫ్కోర్స్ ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారాయి అనుకోండి అది వేరేవిషయం) .
స్పందించిన అందరికీ ధన్యవాదములు,
భవదీయుడు,
బొల్లోజు బాబా
బొల్లోజు బాబా గారూ! నేను నవోదయ విజయనగరంలో చదువుకున్నానండీ (1994-1999). మరువలేని రోజులవి!
ReplyDeleteబాబా గారు,
ReplyDeleteమీ కవిత బాగుంది అని చెప్పలేను ఎందుకంటే అది కొన్ని జీవితాల వ్యధ. అందుకే కదిలించేది గా ఉంది అని చెప్తున్నా. ఆలోచింపజేసేదిగా ఉంది.
మానవజీవన వైవిధ్యం చూడండి, తమ శరీరాలని అమ్ముకుని కృళ్ళిన బ్రతుకులు బ్రతుకుతున్న స్త్రీలు ఉన్న సమాజం లోనే అందాన్ని ఎరగవేసి అందలాలు ఎక్కుతున్నవాళ్ళూ ఉన్నారు.
అయినా సామాజికవ్యధల్ని మీ కవితల్లో పలికిస్తున్నందుకు మిమ్మల్ని తప్పక అభినందించాలి.
సమాన ఆస్తి హక్కు, 30% రిజర్వేషన్ల వల్ల ఏం లాభం?
ReplyDeleteజీవన పరిస్థితులు మెరుగుపర్చాలి కానీ?
Evaru chestaru sir..ee pani(jeevana paristitulu meruguprarchadam)..prabhutvalu(oka vidhamga mantrulu ani cheppochu)vari vari vataalu sardukodaniki time saripovatam ledu..evaro vastarani edo chestarani..enta kaalam sir...randi maname edo okati cheddamu...emanna cheddamante munduku randi...alochiste oka maargam dorakka podu...kada..
శశి కాంత్ గారు అవునా? కత్తి మహేష్ గారు కూడా నవోదయా ప్రోడక్టే మీకు తెలుసా?
ReplyDeleteమురళి గారు థాంక్సండీ. మీరన్న వైరుధాలు ఉన్నాయండీ. కొంచెం క్లారిటీ కోసమని గూగిల్లి ఒక ఫొటోను కూడా ఉంచాను. నా పాయింట్ ఆఫ్ వ్యూని తెలుపటం కోసం.
పప్పు గారికి
నిజమేనండి.
ఆస్తి హక్కు, రిజర్వేషన్లు వంటివి ఆల్రడీ కొంత సేఫ్ జోన్ లో ఉన్న వారికి తప్ప మామూలు వారికి అవి అందటం లేదన్నది నా అభిప్రాయం.
ఇక పోతే జీవన పరిస్థితులు మెరుగుపరచటం అంటే నాఉద్దేశ్యం విద్య, ఆర్ధిక స్వావలంబన, ఆత్మన్యూన్యతా భావనల తొలగింపు, ఉపాధి కల్పన వంటి వండి. ఇవి ఏ ప్రభుత్వమైనా కొంతవరకూ చేస్తున్నదనే నా భావన. విద్యపై, ఉపాధి కల్పనపై చట్టాలు చేసింది. వ్యక్తిగతంగా పెంపొందించుకోవలసిన విషయాలలో ప్రభుత్వాలు కానీ, వ్యక్తులు కానీ ఏమీ చేయలేరేమో. ఉదా: ఆత్మన్యూన్యతా భావనల తొలగింపు వంటివి.
కవిత చదివి మీభావాలను పంచుకొన్నందుకు ధన్యవాదములండీ.
బొల్లోజు బాబా
"ఆ నాలుగు రోడ్ల కూడలి" అంటూ దూరం నుంచి చూయించారు...
ReplyDelete"ఇక్కడ స్త్రీ చర్మం గజాల్లెక్కనా"అంటూ లోనికి ప్రవేశించారు...
"పింప్ లు పిండుకోగా ఈ స్థనాల్లో" ఇక్కడ డిమాన్స్ట్రేట్ చేశారు...
"ఈ కసుగాయల చెక్కిళ్లు చిదిమితే" అంటూ అక్కడే ఉన్నారు..
"అదే మృత్యుదాతయై విరాజిల్లుతుంది. " అంటూ ఫుల్ స్టాప్ పెట్టి...
"సమాన ఆస్తి హక్కు, 30% రిజర్వేషన్ల వల్ల ఏం లాభం?
జీవన పరిస్థితులు మెరుగుపర్చాలి కానీ?" అంటూ ముగించారు.నిజమే మీరు కొంతకాలం క్రితం రాసారు కాదన్ను,కానీ ఇలా ఇప్పుడు ఇలా ఒక వ్యాఖ్య చేసి,ఒక ప్రశ్నవేసి వదిలేయటం ధర్మం కాదు.చెప్పండి ఏదో ఒకటి,చెయ్యగలిగేది,కనీసం ఆలోచన వైపు నడపగలిగేది.