Tuesday, June 24, 2008

ఇన్విజిలేటర్ మనోగతం

ఇన్విజిలేటర్ మనోగతం

యేడాది జీవితకాలాన్ని
పదికాగితాలు నిర్ధేశిస్తాయిక్కడ .

పరీక్ష వ్రాయటం అంటే
విజ్జానాన్నినెత్తి కెత్తుకొని,
మూడు గంటల మొహాన
కుమ్మరించటమే.

ఈ మూడు గంటల కోసమేకదా
మనసుని పంజరంలోపెట్టేసి,
శరీరాన్ని శుష్కింపచేసి
మెదడుని గచ్చకాయని చేసి
కాలమనే గచ్చుపై అరగదీయటం.

తెలిసిన ప్రశ్నలొస్తే
గంటల ముల్లు తూరీగ రెక్కలు
ధరిస్తుంది.
ప్రశ్నలు ప్రశ్నలలాగె మిగిలితే
సెకండ్లముల్లు నత్తగుల్లని
తొడుక్కుంటుంది.

పరిక్షా హాలులో
అప్పుడప్పుడు, అక్కడక్కడా
సంజ్ఞలు, సంకేతాలు,
గుసగుసలు, దొంగచూపులు,
వాళ్లందరినీ దొంగలను,
నన్నేమో పోలీసును చేస్తాయి
ఎంత నైతిక హీనత్వం?


పరీక్షవగానే పిల్లలకెంత రిలీఫో!
తొమ్మిదినెలల బరువుని
దించుకొన్న తల్లి కన్నులలోని
వెలుగంత రిలీఫ్.

బొల్లోజు బాబా

11 comments:

  1. baba garu,
    Entha goppaga chepparu chinna chinna padhalatho.athadi manogathanne kaadu jeevitha chitrana kuda chesaru.marvellous.

    ReplyDelete
  2. పరీక్షవగానే పిల్లలకెంత రిలీఫో!
    తొమ్మిదినెలల బరువుని
    దించుకొన్న తల్లి కన్నులలోని
    వెలుగంత రిలీఫ్.--చాలా చాలా బాగుంది మీ ఆఖరి పేరా.టోపీ ఎత్తి పట్టుకుంటున్నాను.

    ReplyDelete
  3. నాని గారికి,
    అన్నమయ్య పలుకుబడులు గారికి,
    కొత్తపాళీ గారికి,
    మేధ గారికి,
    నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  4. Ninnnae mee blog choosandi baba garu...mee posts bagunnayyi..esp..Mrutyu mannu...really good..

    ReplyDelete
  5. baba garu,

    కౄర మృగం chadivara? expecting ur comments.

    ReplyDelete
  6. గురువుగారు మీ అనుభవాల సారాన్నంతా రంగరించి మాపై కుమ్మరించారండి. నిజమే ఎన్ని రోజులో పరీక్షలనే కష్టాలు ఈ పిల్లలకి.

    ReplyDelete
  7. పరీక్షల అనుభవం ప్రతిఒక్కరికీ ఇలాగేవుంటుందని కరెక్టుగా చెప్పారు..బావుంది.

    ReplyDelete
  8. వర్మ గారికి
    చాలా చాలా ధన్యవాదాలు.

    బొల్లోజు బాబా

    ReplyDelete