Thursday, January 1, 2026

కొత్తసంవత్సరం పూట





నిన్నటి సూర్యుడే
ఉదయాన్ని వెచ్చగా తాకాడు
నిన్నటి కాంతే
ఆకాశపు మడతలలోంచి
ఆకులపై నిశ్శబ్దంగా జారింది.
నిన్నటి వెలుగే
కళ్ళల్లో కన్నీళ్ళ అంచులవరకూ
పరచుకొంది

కాలం కొత్తదైందని
చెప్పుకొంటాం
కానీ
దారి పాతదే
నడకా పాతదే
గోడపై రాసిన నినాదమూ పాతదే

ఎత్తిన గ్లాసులో
అదే ఆశల మత్తు
అదే నిన్నటి రుచి.

బొల్లోజు బాబా
1/1/2026

No comments:

Post a Comment