హోలోకాస్ట్ ఒక్కసారిగా జరిగిందా
బిగ్ బాంగ్ లా?
లేదు.
అది మెల్లగా మొదలైంది
పద్దతిగా. పథకం ప్రకారం. క్రమక్రమంగా.
చరిత్రను చెరిపేశారు
మనుషులను రాక్షసులుగా మార్చారు
సమాధులని చదునుచేసారు
మాట్లాడేవారిని మాయం చేసారు
Wali Dakhani* రోడ్డుగామారింది.
రేపిస్టులు* సంస్కారులుగా కీర్తించబడ్డారు
కాలిబొగ్గుగా మారిన దేహాలు నా కలల్లో
పదే పదే కనిపించేవి.
వాటిని అడిగాను
గాస్ చాంబర్స్ లోకి వారిని నడిపించిన శక్తులేవి
నేరస్తులు ఏ పాటలు పాడుతున్నారు అని?
అవి ఏ మాత్రం తడుముకోకుండా సమాధానం ఇచ్చాయి
మా ఇరుగుపొరుగు వ్యక్తుల మౌనం
భయంకరమైన మౌనం. వెంటాడే మౌనం..అని
ఆ మౌనం
బస్సులలో, టీవీలలో, వార్తా పత్రికలలో
వంటిళ్లలో, పార్లమెంటులో ఉన్నట్లు
బిగ్గరగా ఉంటుందా అని
అడగటానికి సాహసించలేకపోయాను
కాలిన చర్మపు వాసన ఒక అంటురోగం
నా చర్మంపై ఆ వాసన తెలుస్తోంది.
అభినందనలు!
భీకరమైన మీ మౌనానికి.
మీరే గెలిచారు.
మూలం: Congratulations! Your Silence Has Won! by Moumita Alam
అనువాదం: బొల్లోజు బాబా
*Wali Dakhani మతాతీతంగా కొలువబడే ఒక సూఫీ కవి దర్గా. గోద్రా అల్లర్లలో నేలమట్టం చేయబడి దాని స్థానంలో తారురోడ్డు వేయబడింది.
*బిల్కిస్ బనోని రేప్ చేసినవారు సంస్కారులని ఒక నాయకుడు అన్నాడు
No comments:
Post a Comment