Saturday, July 10, 2021
Imported post: Facebook Post: 2021-07-10T23:39:52
ఒక పుష్కరకాలంగా ప్రశ్నిస్తూన్న గొంతు ఆగిపోయింది. కత్తిమహేష్ పర్ణశాల బ్లాగర్ గా 2008 నుంచి పరిచయం. చాలా యాక్టివ్ గా వివిధ సామాజిక అంశాలపై స్పందిస్తూ, చర్చిస్తూ, గొప్ప ఎనెర్జీతో ఎదుర్కొంటూ ఉండేవాడు. బ్లాగుల కాలంలోనే చాలా వివాదాలను చూసాడు మహేష్. వివిధ ఛానెల్స్ ద్వారా నిన్నటివరకూ చేసిన పోరాటానికి దాదాపు సెమి ఫైనల్స్ లాంటి అనుభవాల్ని 2009 లోనే బ్లాగుల ద్వారా ఎదుర్కొన్నాడు.
అతని సామాజిక నేపథ్యం అప్పుడూ ఇప్పుడూ ఓ రక్తజీరలా వెంటాడటం ఒక విషాదం.
.
అతని నిష్క్రమణ వల్ల ప్రశ్నించటం, స్వేచ్ఛాయుత భావవ్యక్తీకరణ విషయాలలో తెలుగు సమాజం ఒక దశాబ్దం వెనక్కు నడచిందనిపిస్తుంది.
ఇంతటి బలమైన గొంతు మళ్లీ ఎంతకాలానికి వింటామో....
We Miss him. May his soul rest in peace.
.
2009 లో కత్తిమహేష్ పై జరిగిన ఒక చర్చలో నేను వెలిబుచ్చిన అభిప్రాయాలివి.... పుష్కరకాలమౌతోంది. పరిస్థితులు ఏమీ మారలేదనే అనుకొంటాను....
****
Bolloju Baba said...
June 24, 2009 at 8:33 PM
it has been a good discussion sofar.
మహెష్ గారి వ్రాతల్లో ఒక మంచి వాదనా పటిమ కనిపిస్తూంటుంది. ప్రాచుర్యంలో ఉన్న అభిప్రాయాలకు భిన్నంగా తన వ్రాతలు ఉండాలని భావిస్తారాయన. చెప్పే విషయాన్ని సూటిగా, ఓపెన్ గా చెపుతారు. ఇవన్నీ ఒక మంచి రచయితకు ఉండవలసిన లక్షణాలు.
ఒక భావాన్ని నలుగురి ముందుకూ తీసుకొనివచ్చినప్పుడు, దానిని విభేదించే వారు వారివాదనలు వ్రాతలకే పరిమితం చేయాలితప్ప వ్యక్తిగతంగా, మహేష్ నీ, మహేష్ కుటుంబసభ్యులను లాక్కురావటం తప్పు. ఒక వ్యక్తి స్వేచ్చాశ్రంగారాన్ని ప్రతిపాదిస్తే, నీపెళ్ళాన్ని నావద్దకుపంపిస్తావా అని అడగటం మర్యాదకాదు. ఆ పద్దతివల్ల వచ్చే లాభనష్టాలు చర్చించాలి, దాని వ్యతిరేక పరిణామాలను తెలియచెప్పాలి ఒప్పించాలి, లేదా ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరికీ వారివారి అభిప్రాయాలను స్వేచ్చగా ప్రకటించుకొనే అవకాశాన్నిచ్చిన రాజ్యాంగాన్ని స్మరణలోకి తెచ్చుకొని తప్పుకోవాలి.
అంతే తప్ప ఒక వ్యక్తి పేరుతో డిరొగేటరీ రిమార్కులతో టపాలపై టపాలు రాయటం, ఎక్కడ చూసినా వెక్కిరింతలు హేళనలతో కామెంట్లు పెట్టటం, ఇది సంస్కారం అనిపించుకోదు.
మరొక విచిత్రమైన విషయం ఏమిటంటే, అలా చేసేవాళ్ళెవరూ ధైర్యంగా ఇది నేను, నా పేరు ఇది, నా వూరుఇది నా ఏడ్రస్సు ఇది అని చెప్పి చేయటం లేదు. అలా పేరుచెప్పుకోలేని తనంతో వ్రాసే వ్యాఖ్యలను బట్టి వారెంత ఫికిల్ మనస్కులో అర్ధం అవుతూనే ఉంటుంది.... //
June 24, 2009 at 8:33 PM
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment