Monday, September 12, 2011

కవిత్వం


ఆమె వచ్చి కూర్చొంది
ఇద్దరి మధ్యా నిశ్శబ్దం
రివ్వున వీస్తోంది

ఎక్కడి నుంచైతే నా భవిష్యత్తుని
ప్రారంభించానో ఆ పెదవులు
సన్నగా కంపిస్తున్నాయి

కానీ
ఆ నాటి కరుణ స్పందన కాదిది

ఇరువురి మౌనం
ఆ క్షణాల్ని కోసుకొంటూ సాగుతోంది
నదిని చీల్చుకొంటూ సాగే నావలా

హృదయ వేదికపై
మృత   జ్ఞాపకాల
కరాళ నృత్యం

శకలాల్ని ఒక్కొక్కటీ
ఏరుకొంటున్నాను

జారిపోతున్న చీకటినంతా
కూడదీసుకొని
"ఇక వెళ్తాను" అని లేచింది
"వెళ్ళొస్తాను" అను
"వస్తే....... వెళుతున్నానుగా!" అంది

నా నిస్సహాయ చూపుల్ని
విడిపించుకొని
ఆమె వెళిపోయింది
.............

రెండోసారీ
పునర్జన్మించాల్సినంత
జీవన కాంక్ష
ఎంతకీ కలగట్లేదు

ఇక శలవ్!

బొల్లోజు బాబా


9 comments:

  1. "రెండోసారీ
    పునర్జన్మించాల్సినంత
    జీవన కాంక్ష
    ఎంతకీ కలగట్లేదు"

    ఈ బాధ అర్ధమయింది కానీ, ఇంకాస్త గట్టి కారణం వెతుక్కోవాలి ఇటీవలి మీ కవిత్వరాహిత్యానికి!

    ReplyDelete
  2. కవికి చావంటూ ఉంటే కదా, పునర్జన్మగురించి ఆలోచించడానికి! ఎంత విరహంతోనైనా అనంతంగా జీవించడమే అతనికి రాసిపెట్టిన రాత.

    ReplyDelete
  3. afsargaariki, bhairavabhatlagaariki

    thank you

    ఇంకాస్త గట్టి కారణం వెతుక్కోవాలి
    anthenantaaraa. ee rOju andhrajyothilo namduri vaaripai mee vyaasam baagundi sir

    అతనికి రాసిపెట్టిన రాత. :-/

    bhavadeeyudu

    bollojubaba

    ReplyDelete
  4. Interesting use of phrases ..
    నిశ్శబ్దం రివ్వున వీస్తోంది .. etc.

    ReplyDelete
  5. "ee rOju andhrajyothilo namduri vaaripai mee vyaasam baagundi "

    అవును, బాబా, నండూరి కి మనం సరిగ్గా తుది వీడ్కోలు ఇవ్వలేదన్న బాధ కూడా వుంది! పోయిన తరవాత కూడా మనం మనుషుల్ని గౌరవించలేమా?

    ReplyDelete
  6. "వస్తే....వెళుతున్నానుగా"

    వస్తే రెండు కవిత్వ పాదాలు తప్ప మరేమీ ఇచ్చుకోలేని కవికి ఇలానే వీడ్కోలు వుంటుందేమో....

    బాగుంది సార్...

    ReplyDelete
  7. Bhavyam......Baabaa jee....sreyobhilaashi ...Nutakki Raaghavendra Rao.(Kanakaambaram)

    ReplyDelete
  8. కవిగా జీవించడమే జీవన కాంక్ష ప్రకటించడం. పునర్జన్మించడానికి అంతకు మించిన కారణం ఏముంటుంది చెప్పండి?
    అఫ్సర్ చెప్పినట్టు తెలుగు సాహిత్యం అకవిత్వం వైపు మళ్ళుతున్నట్టయితే, నిజంగా మనం వర్డ్స్ వర్త్, కోలరిడ్జ్ ఆశించిన రొమాంటిక్ మూమెంట్ ని ఆవిష్కరించే దిశలో సాగుతున్నట్టే.
    ns మూర్తి.

    ReplyDelete
  9. aashavaadam vaipuku maralandi. kavitva deepaanni kaasta veliginchandi.
    aartee mariyu aatmeeyatho

    ReplyDelete