చేతిలో రంగుల ఉత్తరం
గులాబీ పువ్వుతో
ఆ అబ్బాయి బస్సుకై
ఎదురుచూస్తున్నాడు
తను గుర్తుకొచ్చింది
ఒకనాటి
పూర్తికాని చుంబన పరిమళం
ఎదంతా పరచుకొంది
ఆ అబ్బాయి కళ్ళు
ఆగిన ప్రతి బస్సునీ
వెతుకుతున్నాయ్.
అతను అచ్చునాకులానే
ఉన్నాడనిపించింది
అవే కళ్ళు ...
అవే చూపులు ...
అదే గులాబీ ...
ఏమో నేనే
ఆ అబ్బాయినేమో!
ఆ అబ్బాయే
నేనేమో!
మరోసారి తడుముకొన్నాను
జెబులోని
గులాబీ రేకల గరగరల్ని
బొల్లోజు బాబా
గులాబీ పువ్వుతో
ఆ అబ్బాయి బస్సుకై
ఎదురుచూస్తున్నాడు
తను గుర్తుకొచ్చింది
ఒకనాటి
పూర్తికాని చుంబన పరిమళం
ఎదంతా పరచుకొంది
ఆ అబ్బాయి కళ్ళు
ఆగిన ప్రతి బస్సునీ
వెతుకుతున్నాయ్.
అతను అచ్చునాకులానే
ఉన్నాడనిపించింది
అవే కళ్ళు ...
అవే చూపులు ...
అదే గులాబీ ...
ఏమో నేనే
ఆ అబ్బాయినేమో!
ఆ అబ్బాయే
నేనేమో!
మరోసారి తడుముకొన్నాను
జెబులోని
గులాబీ రేకల గరగరల్ని
బొల్లోజు బాబా
బొల్లోజు బాబా గారూ..మీ వ్యాఖ్యలు 'మానస వీణ' లో చూశాను. మీ కవితకి వ్యాఖ్య పెట్టడం కొంచెం ఖంగారుగా ఉంటుంది అయినా సాహస౦ చేస్తున్నాను. బావుంది.
ReplyDelete