Wednesday, June 17, 2009

ఫ్రాగ్మెంట్స్ 4


1

"బాబూ! ఒక స్ట్రిప్ పిల్స్ ఇవ్వు"
జీన్స్ లో ఆమె
బైక్ పై అతను.
రసాయిన సమానత్వం.
*******

2

పాతికేళ్లలో ప్రపంచం
ఎంతమారిపోయినా
మావూరి తాటి ముంజెలకు
ఇంకా అదే రుచి.
*******

3

సీసాలో ద్రవంలా
లోకపు అన్ని వంకరలనూ
ఇముడ్చుకొన్న నాడు
సంకెళ్లు కూడా సుఖంగా ఉంటాయి.
*********

4

ఖాళీ చేసిన ఇంటివాసన
గుండెగొంతులో
బిలబిలా జారే
సారాయి గరగర.
*******


బొల్లోజు బాబా

8 comments:

  1. ఏంటి బాబాగారూ చానాళ్ళకు దర్శనమిచ్చారు. ఇన్నాళ్ళ తరువాత వచ్చీ బుల్లిబుల్లి కవితలేనా.

    మొదటి ఫ్రాగ్మెంట్ లో "జీన్స్"అమ్మాయి అవసరం అంటారా? కొంత స్టీరియోటైపింగ్ లాగా లేదూ! మూడో ఫ్రాగ్మెంట్ నాకు బాగా నచ్చింది.

    మీ దృష్టికోసం నా బ్లాగులో కొన్ని కవితలు వేచిఉన్నాయి. ఈ క్రింది లంకెలో చూడండి
    http://parnashaala.blogspot.com/search/label/%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4

    ReplyDelete
  2. రెండొవది చాలా బాగుంది

    ReplyDelete
  3. మహేష్ గారు
    మీ ఆత్మీయ పలకరింపుకు ధన్యవాదాలు.
    మొదటి ఫ్రాగ్మెంటు వ్రాసింది రసాయిన సమానత్వం అనే పదం కోసం. ఇక జీన్స్ ఫాంటులు, బైకులు పైపై అతుకులు.
    ఐ పిల్స్ (ఎమర్జన్సీ పిల్స్) దుర్వినియోగం పట్ల కొంత సెటైరికల్ గా వ్రాసినటువంటిది.
    మీ పరిశీలనకు కృతజ్ఞతలు.
    సంతోష్ గారు థాంక్సండీ.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  4. బాబా గారు,
    నానోలని విమర్శించి మీరే ఇలా ఫ్రాగ్మెంట్స్ అని రాసారేమిటి? వీటికి వాటికి తేడా ఏమిటో వివరించగలరా?

    ReplyDelete
  5. ప్రదీప్ గారు
    అవి నానోలు ఇవి ఫాగ్మెంట్ల్లు,
    అంటే శకలాలు. అంతే తప్ప పూర్తి రూపాలు కాదు.

    ReplyDelete
  6. sir, when can we see the full parts...

    ReplyDelete
  7. i dont know.
    i am sorry.
    i consider these as stray thoughts rather than full fledged poem or any form of poetry.

    thats all

    thank you for the interest

    ReplyDelete
  8. చాలా బాగుంది బాబా గారు.
    సీసాలో ద్రవంలా
    ఈ లోకపు అన్ని వంకరలనూ
    ఇముడ్చుకొన్న నాడు
    సంకెళ్లు కూడా సుఖంగా ఉంటాయి.

    నిజం కదు.. కాని ఎప్పటికో...

    ReplyDelete