ఊరి చివరి చెరువు నీళ్ళు తేవటానికై అమ్మ బిందె తీస్కొని వెళ్ళింది.
మద్యాహ్నమైంది. పిల్లల ఆటలు ముగిసాయి.
చెరువులోని బాతులు నిశ్శబ్ధంగా ఉన్నాయి.
రావిచెట్టునీడలో పసులు గాసే పిలగాడు కునుకు తీస్తున్నాడు.
మామిడితోపుల చిత్తడిలో ఓ కొంగ నిశ్చల గాంభీర్యంతోజపం చేస్తున్నది.
ఇదే అదుననుకొన్నదో ఏమో!
పాపాయి కనులనుండి నిదుర దొంగ
నిదురను దొంగిలించి మాయమయ్యింది.
అమ్మతిరిగి వచ్చేసరికి , పాపాయి గదిలో కలియపాకుతూ తిరుగుతోంది.
పాపాయి కనులనుండి నిదురను దొంగిలించింది ఎవరు? నాకు తెలియాలి.
ఆమెను కనుగొని గొలుసులతో బంధించాలి. ఆమెవరో నాకు తెలియాలి.
ఆ చీకటి కొండగుహలో గులకరాళ్ళ మధ్య
ఓ చిరుసెలయేరు పారాడుతున్నది. అచట వెతకాలి.
ప్రశాంత రాత్రివేళ సంచరించే నిశి మోహిని కాలిమువ్వల గలగలలకూ
గూటి పావురాల గుబగుబలకూ మత్తుగొలిపే నీడనిస్తున్న ఆ పొగడ తోపులో వెతకాలి.
సాయింకాల వేళ మిణుగురుల కాంతి తారాడే
వెదురుపొదల గుసగుసల మౌనంలోకి తొంగి చూస్తాను.
కనపడిన ప్రతి జీవినీ "నిదుర దొంగ ఎక్కడ నివసిస్తుందో చెప్పండి" అని ప్రశ్నిస్తాను.
పాపాయి కనులనుండి నిదురను దొంగిలించింది ఎవరో నాకు తెలియాలి.
ఆమె గానా నాకు దొరికిందా, మంచి గుణపాఠమే చెపుతాను.
ఆమె గూటిపై దాడిచేసి తాను దొంగిలించిన నిద్రలను
ఎక్కడ దాచుకొందో పట్టుకుంటాను.
దానిని కొల్లగొట్టి, ఆమెను ఇంటికి తీసుకొని వెళతాను.
ఆమె రెండు రెక్కలను బంధించి, ఏటిఒడ్డున కూర్చోపెట్టి
రెల్లు గుబుర్లతో, చేపలతో ఆడుకొమ్మని, పేక బెత్తంతో శాసిస్తాను.
సాయింత్రం బజారులు ఖాళీ అయిపోయాకా
పిల్లగాండ్రు తల్లుల ఒడిలో చేరేవేళ
ఆ నిదురదొంగ చెవులలో రాత్రిపక్షులు
"ఇక ఇపుడు ఎవరి నిద్రనూ నీవు దొంగిలించలేవు" అని అరుస్తో పరిహసిస్తాయి.
బొల్లోజు బాబా
మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Sleep Stealer
అనే గీతం
ఇది అస్సలు అనువాదంగా అనిపించలేదు. మంచి వర్ణనలు మంచి పదాల మాటున దోబూచులాడినట్టుంది. చివరి మూడు పేరా లు కొంచెం గాడి తప్పినట్టనిపించింది ( వాక్య నిర్మాణంలో ). విమర్శ అనుకోకుండా సహృదయంతో తీసుకో గలరని ఆశ.
ReplyDeletereddi gaaru
ReplyDeletethanks andi.
i am looking to refine it sir. thank you for the suggestion.
that too i took some freedom in the last paragraph, while translating sir. probably that might have misfired. :-)
thank you sir.
bollojubaba
excellent sir
ReplyDeletejayabharath
ఒరిజినల్ వర్షను నేను చదవలేదు కనుక మీ ఈ తర్జుమలో వాడిన ఉపమానాలు పద చిత్రాలు బాగున్నాయి. అభినందనలు. :)
ReplyDelete