అపుడెపుడో
సాయింత్రపు నడకలో చెరువు గట్టున
ముద్దులొలికే
ఓ స్నేహం పిల్లను చూసాను
ఎవరో
ఏ పరిచయాన్నో విత్తనం చేసి నాటి ఊంటారు
ఆకుపచ్చ
ముక్కుతో మట్టిపొరల్ని పొడుచుకొని
బయటకు
వచ్చి విప్పారిన పత్రాలతో లోకాన్ని చూసింది.
ముద్దులొలికే
ఆ చిన్నారి స్నేహం పిల్ల
ఆకుల్ని
రాల్చుకొనీ రాల్చుకొనీ , వేళ్ళని పాదుకొనీ పాదుకొనీ
స్నేహం
చెట్టుగా ఎదిగిపోయింది … చూస్తుండగానే
ఎక్కడెక్కడి
పక్షులో
ఎగురుకొంటో
వచ్చి ఆ స్నేహం చెట్టుపై వాలేవి.
గూళ్ళు
కట్టుకొని
తమని
తాము పిల్లలు పిల్లలుగా బద్దలుకొట్టుకొని
ముక్కలన్నీ
ఏరుకొని మళ్ళా ఎక్కడికో ఎగిరిపోయేవి.
చీకటయితే,
బావురుపిల్లో లేక నీటిపాములో
స్నేహం
చెట్టు మూలమూలలా వెతుక్కొని
కడుపునింపుకొనేవి.
ఆకుపచ్చ
చీర కట్టుకొని
ఆకులవెనుక
సూర్యబింబమంత ఎర్రని బొట్టుపెట్టుకొన్న
స్నేహం
చెట్టుని చాలా సార్లు చూసాను నేను
ఇంకా
రాయబడని అద్భుతగీతాన్ని వింటున్నట్టుండేది.
ఏదో
ఒకరోజున
ఈ
స్నేహం చెట్టు సైకత శిల్పంలా కూలిపోవచ్చు
అయినప్పటికీ
పచ్చగా,
చల్లని నీడతో ఇప్పుడు ఆహ్వానించే
ఈ
స్నేహం చెట్టు నా జీవితాదర్శం.
బొల్లోజు
బాబా
ఆదర్శవంతమైన స్నేహం.
ReplyDelete