గాథాసప్తశతి - 7
{గాథ అంటే రమ్యంగా ఉండే
చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది
హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన
పరిచిన గ్రంధం పేరు. ఈ గాధలలో ఆనాటి పల్లెజీవనము,
ప్రకృతి సౌందర్యం,ప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు కనపడుతూంటాయి.
ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.}
సప్తశతి
గాథలలో చాలాచోట్ల జీవితానుభవాలు చక్కని
ఉదాహరణలతో దర్శనమిస్తాయి
ధనస్సును తాకిన మరుక్షణం
రివ్వున
దూరమౌతుంది బాణం
వంకరగా
ఉండే
వారితో
సూటిగా
ఉండేవారు స్నేహించగలరా? ------ గాథాసప్తశతి
ఒకప్పుడు నీ కనులు నా చెంపలను
అలా చూస్తూనే ఉండేవి
నేనీనాటికీ అలానే ఉన్నాను
నా చెంపలు కూడా.
నీ కళ్ళు మాత్రం అలా లేవు.
------ గాథాసప్తశతి
మనసుపడినవాటిని ఎంచుకొంటాము తప్ప
గొప్పలక్షణాలను బట్టి కాదు.
పుళిందులు ముత్యాలను కాదని
గురివిందలను కోరుకోరా? ------ గాథాసప్తశతి
సుదీర్ఘకాల సహజీవనం లో కష్టసుఖాలు పంచుకొని
ప్రేమ అర్ధాన్ని కనుగొన్నదంపతులలో
మొదటచనిపోయినవారు బ్రతికినట్లు
రెండవవ్యక్తి ఉన్నా చచ్చినట్లే. (142)
కత్తులు ధరించిన కసాయివాళ్ళు తోలుకుపోతూంటే
గేదెలు వెనక్కు తిరిగి తోటను చూస్తూ
ఇక శెలవు అంటూ సాగిపోయాయి. ------ గాథాసప్తశతి
మగడెంత బ్రతిమాలినప్పటికీ
తన కోపం తగ్గలేదన్న విషయాన్ని
ఆమె బహు నేర్పుగా చెప్పగలదు.
ఏకాంత మందిరంలో కూడా
మగనికి మర్యాదలు చేస్తోంది. -----
(88)
రత్యానంతరం వివశురాలైన ఆమె
చనిపోయిందనుకొని
పాలెకాపు భయంతో పారిపోవటం చూసి
సగం విచ్చుకొన్న
కాయలభారంతో వంగిన పత్తిచెట్టు
నవ్వుకొంటోంది. ------ (360)
ఓహ్. కాలమా!
ప్రేమకవిత్వం పట్ల రోసిన ఈ యువకుడు
బ్రతకటాన్కి తర్కాన్ని చదువుకొంటున్నాడు
మేమేమో
మా భర్తలకు పరిమితమయ్యాము. ------ గాథాసప్తశతి
(సమాప్తం)
బొల్లోజు బాబా
samapthama?! inka raayandi Sir. we are folowing
ReplyDelete