ఒక పద్యం గురించి.....
సముద్రపొడ్డున నడుస్తుంటే
కొట్టుకొచ్చిన వ్యర్ధాల మధ్య
మెరుస్తూ ఉందో సీసా.
ఏ ద్వీపాంతరవాసి
జీవనసందేశమో
నన్నుచేరింది
సీసాలో వాక్యాలై
ఎన్నో కెరటాల్ని దాటుకొని
ఒక్కో నక్షత్రాన్ని కూపీతీస్తూ
దాని రహస్య
చిరునామాదారుడిని చేరుకొంది
ఒక్కో వాక్యాన్ని తడుముతుంటే
మరెక్కడా లభించని
నా అనుభవాలే.
రెక్కలకు వేళ్లు
వేళ్ళకు రెక్కలు
తొడుక్కొన్న అక్షరాలు.
నా జీవితమే అది.
ఇస్మాయిల్, శిఖామణి, అఫ్సర్, కొప్పర్తి......
ఏమో ఎవరో ఆ ద్వీపాంతర వాసి
కానీ
ఆ వాక్యాలలో సంబోధితుడను
మాత్రం నేనే
బొల్లోజు బాబా
No comments:
Post a Comment