అన్ని నిర్ణయాలు
ముందే అయిపోయాయి
ఏదో కాలక్షేపానికి
జీవించాలి అంతే!
పుట్టినపుడు
మతాన్ని బట్టి
గ్రహాలు పైకీ క్రిందకూ మారతాయి
కులాన్ని బట్టి
తారలు అటూ ఇటూ సర్దుకొంటాయి
కుటుంబాన్ని బట్టి
రాశిచక్రం రూపుదిద్దుకొంటుంది
కలహాలు, ప్రేమలు
పోటీలు, పధకాలు
అన్నీ మనది కాని
ఏదో ప్రణాళికలో భాగాలే
ఆఖర్న మరణం కూడా.
అయినప్పటికీ
ఓ మొగ్గ విరిసినా
ఓ తుమ్మెద వాలినా
ఓ డొలక రాలినా
ఈ చెట్టుకెంత తహ తహ!
వెలుగుని బంధించామనుకొనే
ఈ పత్రాలదెంత అతిశయం!
బొల్లోజు బాబా
బాబా .. ప్రకృతి విన్న్యాసాల్ని గొప్పగా చెప్పావ్ keep it up
ReplyDeleteMee shaili chalaa baagundi :):)
ReplyDeleteఇక మనకు మన సహజ ప్రపంచానికి సంబందం లేదు అన్నట్లు చెప్పారు.హిందూ, ముస్లీం, క్రిస్టియన్ సాంస్కృతి అంతా ఇంతే అతిశయం ఏమీలేదు వీటిని వదిలించడానికి ఏదైనా చెప్పండి మరి.
ReplyDelete"అన్ని నిర్ణయాలు
ReplyDeleteముందే అయిపోయాయి
ఏదో కాలక్షేపానికి
జీవించాలి అంతే!"
యదార్ధం చెప్పారు...
ఎద కు అర్ధమయ్యేలా...
గ్రీటింగ్స్ సర్ ...