Sunday, January 8, 2012

జీవితం

1.
ఎవరూ నడవని
దారి కదాని
ఉత్సాహంగా
ముందుకుపోతూంటే
జీవితం నవ్వుతో
“ఓయ్ పిచ్చిమొద్దూ
నేనిక్కడుంటే అటెక్కడికి
పోతున్నావ్? అంది 
వెనుకనుంచి.



2. 
ఒక మధ్యాహ్నం
ఒంటరిగా సాగిపోతూంది
నేనూ ఒంటరిగానే గదిలో
స్వారీ చేసే నిశ్శబ్దంతో

ఒకే ఫాను
ఒకే కుర్చీ
ఒకే టేబులు
ఒకే నేను
నిశ్శబ్దంగా
మధ్యాహ్నంలోకి
ఒలికిపోయాం
ఇక అది మమ్మల్ని మోసుకొంటూ...

సూర్యుని మొహం
ఎర్రగా కందిపోయింది అసూయతో



బొల్లోజు బాబా

7 comments:

  1. మీ కవితలు చాలా బాగుంటాయి.. బొల్లోజు బాబా గారూ..

    ReplyDelete
  2. చాలా నచ్చింది సార్...

    ReplyDelete
  3. రెండు కవితలూ చాలా బావున్నయ్...

    ReplyDelete
  4. గీతిక గారు, వర్మగారు, జ్యోతిర్మయి గారు
    ధన్యవాదాలండి
    భవదీయుడు
    బొల్లోజు బాబా

    ReplyDelete
  5. కవిత బాగుంది... కాని
    సూర్యుని మొహం
    ఎర్రగా కందిపోయింది అసూయతో...
    ఎందుకో ??

    ReplyDelete
  6. ఈ కవిత చాలా నచ్చిందండీ.

    ReplyDelete