http://www.scribd.com/doc/23859189/Sufi-Poetry-Telugu-translations
నాకు నచ్చిన మరికొన్ని రూమీ గీతానువాదాలు ఇవి.
1
అంతులేదు.
ఈ యానానికి అంతం లేదు.
ఎన్నటికీ ముగింపు రాదు.
ప్రేమలో పడిన హృదయం
తెరుచుకోవటం నిలిపివేయగలదా?
నీవు నన్ను ప్రేమిస్తూంటే
నీవు ఒక్కసారిగా చచ్చిపోవు.
ప్రతీ క్షణం నాలో మరణిస్తూ
తిరిగి జన్మిస్తూంటావు.
ఈ నూతన ప్రేమలో మరణించు.
ఆవలి వైపున నీ దారి మొదలవుతుంది.
ఆకాశంలా మారిపో.
చేత గొడ్డలిపూని కారాగార తలుపులను చేధించు.
పారిపో!
కొత్తగా జన్మించినవానిలా ముందుకు సాగు.
ఆ పని ఇప్పుడే చేయి.
రూమీ
2
రాత్రివేళ
మనం ఒకరినొకరం గొప్ప లౌల్యంతో పెనవేసుకొంటాం
వెలుతురొచ్చాకా నువ్వు నన్ను తోసేస్తావు
నీ కురులను వెనక్కు విదిలించినట్లుగా.
నీ కనులు ఈశ్వరునితో మత్తెక్కి ఉంటాయి.
నావి నిన్ను చూస్తూ,
ఒక తాగుబోతుకు మరొకరు తోడు.
రూమీ
3
రోజంతా నీతో కలసి పాడుతూ ఉన్నాను
ఆ రాత్రి నీ తల్పం పైనే నిద్రించాను.
అది రాత్రో పగలో కూడా తెలియలేదు నాకు.
నేనెవరో నాకు తెలుసని అనుకొన్నాను
కానీ నేనే నీవు.
రూమీ
4
నేను పోగొట్టుకొన్నాను, నా ప్రపంచాన్ని, నా కీర్తిని, నా హృదయాన్ని.....
సూర్యుడు ఉదయించాడు, అన్ని నీడలు పరుగులెత్తాయి.
నేనూ వాటివెనుక పడ్డాను. అవి అందకుండా అదృశ్యమయ్యాయి......
కాంతి నా వెంటబడి వేటాడింది.
రూమీ
5
నేను రూపసిని కాను అందవికారినీ కాను.
అదీ కాదు ఇదీ కాదు.
నేను బజారులో పధికుడినీ కాను
లేక ఉద్యానవనంలో కోయిలనూ కాను.
నా గురువు నాకో పేరు పెట్టాడు కనుక
నన్ను నేను ఎలా సంభోదించుకోవాలో తెలుసంతే.
నేను బానిసనూ కానూ స్వతంత్రుడినీ కాను.
మైనాన్ని కాను లోహాన్ని కాను.
నేనెవరినీ ప్రేమించిందీ లేదు,
నన్నెవరూ ప్రేమిస్తూనూ లేరు.
నేను పాపినా లేక పుణ్యాత్ముడనా
పాప పుణ్యాలు మరొకరిద్వారా వస్తాయి
నానుంచి రావు.
ఆయన నన్ను ఎక్కడికి రమ్మంటే అక్కడకు
మారు మాట్లాడక వెళుతూంటాను. అంతే!
రూమీ
6
తలుపలా తడుతూనే ఉండు
లోపలి ఆనందం కిటికీ తెరచి
ఎవరదీ అని చూసే దాకా!
రూమీ
భవదీయుడు
బొల్లోజు బాబా
కాస్త కష్టంగా ఉన్నాయండి అర్థం చేసుకోవడానికి అయినా ప్రయత్నిస్తాను.
ReplyDeleteBaabaa gaaru,
ReplyDeletemamchi prayatnam. padmaarpita, roomi ni ardham chesukovadam kashtam. ardham chesukunnaaka vadilipettadam kashtam. prayatnimchi choodamdi. meeke ardham avutumdi.
Kalpana
baagunnaayi saar. varavara rao gaaru koodaa aa madhya soofee kavitvampai vyaasam raastU marxism aalochanalaku ante socialistic viewsto sufi bhaavaalaku anubandhaanni vivarinchaaru. mee krushiki dhanyavadaalu.
ReplyDeleteచివరిది షార్ట్ అండ్ స్వీట్ గా ఉంది. ఏంటి బాబా గారూ చాలా రోజులయ్యింది మీరు రాసి. ఎప్పుడు మరు టపా మీ నించి? ఇది మీరు రాసిన రోజే చదివా కానీ తీరికగా ఇంకో సారి చదివి కామెంటు దామని ఆగాను.
ReplyDeleteబలే వున్నాయండి. నేను ఎప్పుడూ వినలేదు ఇవి. చాలా బాగున్నాయి. ఎంత ఘాడం గా వుందో భావం.
ReplyDelete"రోజంతా నీతో కలసి పాడుతూ ఉన్నాను
ఆ రాత్రి నీ తల్పం పైనే నిద్రించాను.
అది రాత్రో పగలో కూడా తెలియలేదు నాకు.
నేనెవరో నాకు తెలుసని అనుకొన్నాను
కానీ నేనే నీవు.
రూమీ" ఒక్క సారి గీతాంజలి చదువుతున్నట్లు అనిపించింది. చాలా బాగున్నాయి. మన్చి అనువాదం బాబా గారు. ధన్య వాదాలు.