Friday, December 26, 2025

కొండలకూ తప్పని SIR....



కోట్ల ఏళ్ళ
ఆరావళి పర్వతశ్రేణి
భూమికి శ్వాస
వానకు గొడుగు
ఎడారికి అడ్డుగోడ
ఢిల్లీకి ఊపిరి
రాజస్థాన్ కు నీడ
నదీజలాలకు జనని

నేడు మేప్ లో
గీతలు మారుతున్నాయి

క్రోనీ కేపిటలిజపు మృగం
లాభాల దాహంతో
కొండల ఛాతీపై
గనుల గాయాలు చేస్తూ
పచ్చని అడవులపై
జూలు విదుల్చుకొని దుముకుతోంది

దాని బుల్డోజర్ విధ్వంసానికి
కొండలు కూడా క్యూలో నిలబడి
తమ అస్తిత్వాన్నే కాదు
తమ పౌరసత్వాన్నీ నిరూపించుకోవాల్సిన
రోజులు వచ్చాయి.


బొల్లోజు బాబా

No comments:

Post a Comment