Friday, April 23, 2021

Imported post: Facebook Post: 2021-04-23T21:03:22

Poem by Rohith . ఒక స్ధాయి దాటిపోయాకా మాటలన్నీ అప్రస్తుతమై మిగులుతాయి ఊరు విడిచిన మిత్రులు ప్రతిధ్వనులుగా మాత్రమే తిరిగొస్తారు బ్రతికుండటం అంటే ఇంకా చనిపోకుండా ఉండటం మాత్రమే కాదు బ్రతికుండటం అంటే ఆకులు నేలరాలటం చెట్లు హింసను మూగగా ఓర్చుకోవటం ఉదయాన్నే పక్షులు గానాన్ని కొనసాగించడం ఎవరినైనా ఇష్టపడటం ఇపుడు వారు వెళ్లిపోయేటపుడు వీడ్కోలు చెప్పలేకపోవటం ఒక ఖాళీ అయిన చోటు ఎన్నటికీ మునుపటిలా ఉండకపోవటం దుఃఖించటం అంటే నిశ్శబ్దహృదయం చేసే సుదూర రోదనలను చెవులురిక్కించి వినటం చివరకు ఇదంతా కలలు రాని నిద్ర ఒక ఖాళీ శవపేటిక . మూలం- poem by Rohith అనువాదం- బొల్లోజు బాబా

No comments:

Post a Comment