Saturday, March 6, 2021

Imported post: Facebook Post: 2021-03-06T14:15:46

నువ్వు, నేను, ఈ జగత్తూ - You and I and the World by Werner Aspenström . నువ్వంటే ఎవరు , నేనంటే ఎవరు ఎందుకు ఇది ఇలా ఉంది అని అడగొద్దు. అదంతా పండితుల పని వాళ్ళు చూసుకొంటారు. కిచన్ టేబుల్ పై తక్కెడ ఉంచు వాస్తవం తనని తాను తూచుకొంటుంది. చొక్కా తొడుక్కో. హాల్ లో లైట్ ఆర్పివేయి తలుపు మూసేయి. శవాలను శవాలు భద్రపరచనీ. మనం అలా తిరిగొద్దాం తెల్ల రబ్బరు బూట్లు వేసుకొన్న మనిషివి నీవు నల్ల రబ్బరు బూట్లు వేసుకొన్న మనిషిని నేను మన ఇద్దరిమీద పడుతున్న వాన వాన Source: You and I and the World by Werner Aspenström (1918–1997) అనువాదం: బొల్లోజు బాబా 6, March, 2018

No comments:

Post a Comment