Sunday, March 14, 2021

Imported post: Facebook Post: 2021-03-14T13:52:36

"మూడో కన్నీటి చుక్క" కవిత్వ సంపుటిని ఇక్కడనుంచి pdf రూపంలో పొందవచ్చును. https://archive.org/details/bolloju-babu-moodo-kanneeti-full *** నిన్న సాయింత్రం సాహితీ స్రవంతి, కాకినాడ వారి ఆధ్వర్యంలో "మూడో కన్నీటిచుక్క" ఆవిష్కరణ, పరిచయ సభ జరిగింది. ఈ సభకు శ్రీ గనారా అధ్యక్ష్యత వహించారు. ప్రముఖ కవి విమర్శకులు శ్రీ అవధానుల మణిబాబు, శ్రీమతి జోశ్యుల దీక్ష గారు ఈ పుస్తకాన్ని విశ్లేషించారు. వారిరువురి ప్రసంగాల లోని ఈ పరిశీలనలు నాకెంతో ఆనందాన్నిచ్చాయి 1. జీవితంలో కనిపించే చిన్న చిన్న అనుభవాలను కవిత్వం చేస్తూ వాటికి ఒక సార్వజనీన తాత్విక ముక్తాయింపు ఇవ్వటం బాబా గారి కవిత్వంలో కనిపించే ముఖ్యలక్షణం - శ్రీమతి దీక్ష, రచయిత్రి. 2. బాబా గారి పూర్వ సంపుటులైన ఆకుపచ్చని తడిగీతం అభివ్యక్తికి, వెలుతురు తెర వస్తు ప్రాముఖ్యతకు అద్దం పడితే - మూడో కన్నీటి చుక్క సంపుటి కవిత్వంలో శిల్ప ప్రాధాన్యత ప్రముఖంగా కనిపిస్తుంది - శ్రీ మణిబాబు **** . ఈ సభను ఏర్పాటుచేసిన శ్రీ గనారా గారికి, శ్రీ మార్ని జానకి రామ్ చౌదరిగారికి, శ్రీ కృష్ణబాబు గారికి సదా కృతజ్ఞుడను. పుస్తకం గురించి లోతైన విశ్లేషణలు చేసిన శ్రీ. మణిబాబు గారికి, దీక్షగారికి ధన్యవాదములు భవదీయుడు బొల్లోజు బాబా 14/03/2021








No comments:

Post a Comment