తెలంగాణా రాష్ట్రంలో శ్రీ కాళోజీ జన్మదినసందర్భంగా పత్రికలలో వ్యాసాలు, సాహితీ సంస్థల ఆధ్వర్యంలో సమాలోచనలు, స్కూళ్ళలో పిల్లల సమక్షంలో సభలు అన్నీ చూస్తుంటే, కన్నుల పండుగలా అనిపించింది. మహాకవిని తలచుకొంటున్న మిత్రులకు అభినందనలు, శుభాకాంక్షలు.
ఈ మధ్య ఒక సభలో ఓ పెద్దాయన చెప్పిన ఒక ఉదంతం - కవిత్వభాషగా ఏది ఉండాలి (ప్రజల భాష లేక గ్రాంధిక భాషా ) అని కవులు దిశానిర్ధేశం పొందటానికి 1950 లలో కాకినాడ పి.ఆర్. కాలేజీలో రెండుమూడు సభలు జరుపుకొన్నారట. తెలుగునాట నలుమూలలనుంచీ వచ్చిన కవులు, పండితులు రెండు వర్గాలుగా విడిపోయి వాదులాడుకొంటున్న సమయంలో, చివరి సభకు విచ్చేసిన శ్రీ కాళోజీ గారు - "ప్రజల భాషే కవిత్వ భాషగా ఉండాలి, అది సామాన్య ప్రజల జీవితాలను ప్రతిబింబించాలి" అంటూ ఉపన్యసించి అందరినీ ఒప్పించారట. ఆ సభలో పాల్గొన్న శ్రీ సోమసుందర్ గారు ఈ మాటలకు ప్రభావితమై, తన కవిత్వ భాషను సవరించుకొని, ప్రజలభాషలో వ్రాయటం మొదలుపెట్టారట.
వినటానికి ఆశ్చర్యం కలిగించేదిగా ఉన్నప్పటికీ, ఆ తరువాత ఓ యాభైఏళ్ళ కాళోజీ జీవితాన్ని, సాహిత్యాన్ని పరిశీలిస్తే వారి మాటల లోతు, నిబద్దతలు అర్ధమౌతాయి. గొప్ప ఫలవంతమైన కవిత్వజీవనం వారిది. వారి స్మృతికి వందనాలు
భవదీయుడు
బొల్లోజు బాబా
పి.ఎస్. ఆంధ్రప్రదేష్ లో ఇంత ......"ఐక్యంగా"...... అంతటి గౌరవం, ఘనతను పొందే సమఉజ్జీ అయిన సాహితీవేత్త ఎవరా అని ఆలోచనలో పడిపోయాను ఇపుడు నేను.
...ఐక్యంగా... దయచేసి సరిచేయగలరు.
ReplyDeleteTypo కాకుండా మీరు ఐక్యత ని వ్యంగ్యంగా ఒత్తి పలకాలనుకుంటే క్షమించగలరు
ReplyDelete-సత్తిబాబు
సత్తిబాబు గారు
ReplyDeleteథాంక్యూ టైపోని సవరించినందుకు. ఐఖ్యంగా తప్పు, ఐక్యంగా ఉండాలి కదూ. మార్చాను. థాంక్యూ....
ఇక వ్యంగ్యం ఏమీ లేదు, ఇది ఆవేదన అంతే. నాకు తెలిసి శ్రీ కాళోజీ గారిని తెలంగాణా సమాజం అంతా ఏకగ్రీవంగా ఈ గౌరవానికి అర్హుణ్ణి చేసింది.