చిన్నపిల్లలతో సంభాషిస్తున్నట్లు చెప్పే కవిత్వం పైకి సరళంగా
కన్పిస్తున్నా లోతైన అర్ధాల్ని పొదువుకొని ఉంటుంది. ఇలాంటి కవితలలో మనం
మరచిపోతున్న మానవత్వాన్ని చిన్నపిల్లల ప్రశ్నల ద్వారా లేదా పనుల ద్వారా మన
ముందుంచుతాడు కవి. చాలా గడుసుగా మనల్ని దోషుల్ని చేస్తాడు. అదొక
మంచి కవిత్వసంవిధానం.
Fady Joudah పాలెస్తీనాకు చెందినవాడు కనుక ఇదేదో పాలెస్తీనా నిర్వాసితుల గొడవలా అనిపించినా, మనప్రభువులు చేస్తూన్న అశ్వమేధయాగం లాంటి భూసేకరణల నిర్వాసితులకూ వర్తించే ఒక సార్వజనీన అంశం కూడా.
కాలానికి, ప్రాంతానికి అతీతంగా ఉండటం గొప్పకవిత్వ లక్షణం కాదూ?
అనుకరణ -- by Palestinian poet Fady Joudah
తన సైకిల్ హేండిల్స్ మధ్య
గూడుకట్టుకొన్నసాలెపురుగుని
రెండువారాలుగా
అదిలించ లేదు మా అమ్మాయి
దానంతట అదే వెళిపోయే వరకూ
ఎదురుచూసింది.
నీవు దాని గూటిని తొలగించి ఉన్నట్లయితే
అది తెలుసుకొనేది కదా "ఈ ప్రదేశం తన ఇల్లు కాదని;
నీవూ చక్కగా సైకిల్ తొక్కుకొని ఉండేదానవు" అన్నాను నేను
మనచుట్టూ ఎంతోమంది
నిరాశ్రయులు అవుతున్నది అలానే కదూ?'
అంది మా అమ్మాయి.
Poem by Palestinian poet Fady Joudah
తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

No comments:
Post a Comment