Sunday, February 21, 2016

ఇంటికి తీసుకెళ్ళవా?


హరప్పా పురవీధిలో నడుస్తూ
వెనక్కు తిరిగి నవ్విన సుందరికి
కాలాతీత కొనసాగింపు నీవు
అంతఃపుర రహస్యమార్గం నిర్మించాకా
అదృశ్యం చేయబడ్డ ఆచారి విసిరిన
అలౌకిక దేహ రేణువును నేను
నిప్పుల మధ్య
నల్లని బొగ్గు అంచులతో
సకంకాలిన కలలు
రాతి పొరల మధ్య శిలాజాలు.
ఏ మాత్రమూ భరించలేని
నిరీక్షణ! ఈ రక్త శ్వాస.
మట్టిని వెతుక్కొంటోంది విత్తనం
నన్ను ఇంటికి తీసుకెళ్ళవా?

బొల్లోజు బాబా

7 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. Dear anonymous
    thank you for expressing your views
    As you have every right to express your views, you have to remember that i too have.
    మీకర్ధం కాలేదన్నారు. ఫైన్.
    మీకు అర్ధం చేయాల్సిన పని నాది కాదనుకొంటాను.
    మీరు నిజమైన విమర్శ చేయదలచుకొంటే, మీ పేరుతో చెయ్యండి. లేక నా మేలుకోరి సలహా ఇవ్వదలచుకొంటే ఇన్ బాక్స్ లో ఇవ్వచ్చు.
    ఇలా ముసుగువేసుకొని మాట్లాడటం దేన్ని సూచిస్తుందో మీరే ఊహించుకోగలరు
    మీ కామెంటు డిలిట్ చేసాను గమనించగలరు

    ReplyDelete
    Replies
    1. చిన్న మాట మరిచాను
      ఒక కవిత అర్ధం అవ్వటం అవ్వకపోవటం పై ఈ లింకులో మంచి చర్చ జరిగింది. మీకు వీలుంటే చదవండి.
      http://sahitheeyanam.blogspot.in/2009/11/blog-post_17.html

      Delete
  3. పేరులో నేమున్నదిసార్. నా వాక్యను డిలీట్ చేయటం అన్యాయం. మీరు ఇచ్చిన లింకులో చర్చ పైపైన చదివాను సార్. అది పూర్తిగా ఆకళింపు చేసుకుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. భైరవభట్ల సార్ అన్నట్లు 1 కవిత్వం అనేది అర్ధం కావక్కరలేదు. 2.ఒక కవిత అర్ధం కాకపోవటం కూడా ఒక అనుభూతే. ఈ రెండు వాక్యలు చాలు కవులు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోవడానికి.మీరు చిత్ర విచితమైన భావాలు కవితలపేరుతో ప్రకటించవచ్చు. కానీ బాధితులు స్పందించకూడదంటే ఎలా సార్. నా తొలి వాక్యను తిరిగి ప్రకటించండి ప్లీజ్.

    ReplyDelete
  4. Delete చేసిన కామెంటుని ఎలా ఎనేబుల్ చెయ్యాలో నాకు తెలియదు. మైల్ మెసేజ్ నుంచి మీ కామెంట్ ని కాపీ పేస్ట్ చేస్తున్నాను మీ కోరికపై

    Anonymous has left a new comment on your post "ఇంటికి తీసుకెళ్ళవా?":

    ఏమో సార్.ఈ అర్థం కాని తవికలు ఎంతకాలం రాస్తారు? కొంచెం కూడా బోరుకొట్టదా? అసలు ఈ కవిత్వం వల్ల ఏమిటి ఉపయోగం?

    ఈ రెండు మాటలు చూద్దాము. ఏ మాత్రమూ భరించలేని నిరీక్షణ! ఈ రక్త శ్వాస.- వెంటనే పల్మనాలజిస్టు దగ్గరకు వెళ్ళాలి.

    హరప్ప వీదులేమిటి. శిలాజాలెమిటి. అంత:పుర రహస్య మార్గం. రక్త శ్వాస. వీటికి. పొంతన ఏమైనా ఉందా?

    సారీ సార్. ఈ కవితల కాలానికి కాలం చెల్లింది. ఇది నా అభిప్రాయం మాత్రమే.


    కవిత్వం అనేది రిఫైన్డ్ వచనం. వచనం విప్పిచెప్పితే, కవిత్వం కప్పి చెపుతుంది.

    కవిత్వంలో వచ్చే పదాలకు లిటరల్ మీనింగ్ తీసుకొంటే, రక్తశ్వాస అన్నందుకు నేను పల్మనాలజిస్టు వద్దకు, విశ్వవీణకు తంత్రినై మూర్చనలు పోయినందుకు మహాకవి పిచ్చాసుపత్రికి వెళ్లవలసి ఉంటుంది.

    కవిత్వంపై ఈ మాత్రం కనీస పరిజ్ఞానం లేకుండా కామెంట్ చేసినందుకే మీ కామెంట్ తొలగించవలసి వచ్చింది.
    అంతే కాక..... ఎంతకాలం ఇలా రాస్తారు? ఏమిటి ఉపయోగం? తవికలు, డాక్టరుని కలవండి, కాలం చెల్లింది వంటి మాటలు మర్యాదస్తుల భాషకాదు. నాకు బాధ కలిగించాయి. .
    అనానిమస్ గా చేసారు కనుక ఇదేదో ఆటపట్టించే వ్యవహారం లాగ ఉందనే ఉద్దేసం తో కూడా......

    కథనాత్మక పద్దతిలో కవిత్వం చెప్పటం నేడు జాతీయ అంతర్జాతీయ కవితా రీతి.
    ఆ పద్దతులకు అనుగుణంగానే పై కవిత వ్రాయటం జరిగింది. కనుక ఇది కాలం చెల్లిన విధానం కాదు.

    సాధారణంగా కవితలకు అర్ధం చెప్పటం నాకిష్టం ఉండదు. కవితే అర్ధమవ్వాలి అని అనుకొంటాను.

    ఈ కవిత సంక్లిష్టంగానే ఉంటుంది. కావాలనే అలా వ్రాసాను. వస్తు రీత్యా.

    నేను చెప్పదలచుకొన్న అంశం ఇది.
    అ. ప్రేమను ఎన్నెన్నో జన్మల బంధం అని అంటారు. అలా వేల సంవత్సరాల క్రితం హరప్పా సుందరి, ఒక శిల్పాచార్యుడు ప్రేమించుకొన్నారు.

    బి. అంతఃపుర రహస్యమార్గం నిర్మించిన శిల్పులను రాజులు చంపించేసే వారు ఆవిషయం శత్రువులకు తెలియకూడదని. అలా ఆ ప్రేమికుడు చనిపోయాడు

    సి. ఎంతో కాలం గడిచాకా, (వారికలలన్నీ శిలాజాలైనాయి అన్న సూచన) ప్రస్తుతం ఆ స్త్రీని ఆ పురుషుడు గుర్తించి, నన్ను నీలోకి తీసుకోవా అని అభ్యర్ధిస్తున్నాడు. (ఇల్లు అనేది ఇద్దరు వ్యక్తుల ఆత్మసంయోగాన్ని సూచించే ప్రతీక)

    ముందుగా చెప్పినట్టు కవిత్వం అనేది కప్పి చెప్పే ప్రక్రియ. అర్ధం అయ్యేవారికి అర్ధమౌతుంది. కాని వారికి కాదు. దానికి బాధ్యత కవిది కాదు.

    ముందు దయచేసి మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. రచనలపట్ల చులకనభావం తగ్గించుకోండి. అప్పుడు ఎలాంటి రాతల్లోనైనా అర్ధాలు కనిపిస్తాయి. కనిపించకపోయినా, ఇతగాడు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు అనైనా అనిపిస్తుంది. ఆ పై మీ ఇష్టం

    ఈ చర్చ ఇంతటితో స్వస్థి.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    ReplyDelete
  5. బాబా గారు. మూర్చనలు అంటే మూర్ఛ పోవటం కాదు సారు.రాగం లోని స్వరాల వరుసక్రమం అది.

    ReplyDelete
    Replies
    1. I wrote a long answer. you are not ready to answer it or even acknowledge. you just picked up a technical glitch and wish to show your SUPREMACY.

      its ok thank you
      అరసికులకు కావ్యనివేదనం చేయటం వృధా అని ఏనాడో పెద్దలు చెప్పారు.

      Delete