అమ్మా!
పెళ్ళికిముందు నువు నాన్నకు వ్రాసిన ఉత్తరం
భలేగా ఉందే అంటోంది మా అమ్మాయి
ఆశ్చర్యంగా చూస్తూ.
ఏయ్! అది నీకెక్కడ దొరికిందీ?
ఉత్తరాన్ని గబగబా లాగేసుకొంది మా ఆవిడ.
అవును మరి
బట్టలు ఉతికి ఉతికీ
కారేజీలు సర్ది సర్దీ
చీరకట్టుకొన్న కారేజీలా
మారిపోయిన అమ్మే తెలుసు వీళ్ళకు.
అయినా
ఆ ఉత్తరంలో ఏం కనిపిస్తాయి వీళ్ళకు
గుప్పెడు మల్లెలు
ఇదిగో ఇలాంటి సందర్భంకోసం
కన్న ఏవో కొన్ని కలలు తప్ప.
కానీ
ఆ అక్షరాల మధ్య ....
సగం చెక్కిన శిల్పాన్ని
పూర్తిచేస్తానని ఇచ్చిన మాట,
దినాంతాన
నన్ను పడవలో జాగ్రత్తగా పడుకోబెట్టి
పడవనడిపే వానికి
రెండు బంగారునాణేలు ఇచ్చి
భద్రంగా దాటించమని చెప్తానని
చేసిన ప్రమాణమూ
నాకు తప్ప మరెవ్వరికీ
కనిపించవు.
బొల్లోజు బాబా
బట్టలు ఉతికి ఉతికీ
కారేజీలు సర్ది సర్దీ
చీరకట్టుకొన్న కారేజీలా
మారిపోయిన అమ్మే తెలుసు వీళ్ళకు.
అయినా
ఆ ఉత్తరంలో ఏం కనిపిస్తాయి వీళ్ళకు
గుప్పెడు మల్లెలు
ఇదిగో ఇలాంటి సందర్భంకోసం
కన్న ఏవో కొన్ని కలలు తప్ప.
కానీ
ఆ అక్షరాల మధ్య ....
సగం చెక్కిన శిల్పాన్ని
పూర్తిచేస్తానని ఇచ్చిన మాట,
దినాంతాన
నన్ను పడవలో జాగ్రత్తగా పడుకోబెట్టి
పడవనడిపే వానికి
రెండు బంగారునాణేలు ఇచ్చి
భద్రంగా దాటించమని చెప్తానని
చేసిన ప్రమాణమూ
నాకు తప్ప మరెవ్వరికీ
కనిపించవు.
బొల్లోజు బాబా
Love this poem sir !
ReplyDeletethank you madam. ఇప్పుడే మీ గూగిల్ ప్లస్ పోస్ట్ లు చూసి వస్తున్నాను. చాన్నాళ్ళయింది మేడమ్ మీ పోస్టులు చదివి. థాంక్యూ
Deleteగుండె లోతులికి తగిలింది.
ReplyDeleteథాంక్యూ సార్
Deleteనీకు తప్ప ఎవరికీ కనిపించని ప్రయాణాన్ని అద్భుతంగా కన్పింప చేశావు బాబా గారు
ReplyDeleteనీకు తప్ప ఎవరికీ కనిపించని ప్రయాణాన్ని అద్భుతంగా కన్పింప చేశావు బాబా గారు
ReplyDeletethank you sir
ReplyDelete