రావిశాస్త్రిగారి రచనాసాగరం
చదూతున్నాను. చాలా బాగుంది. మూడార్ల గూఢచారి పేరుతో రావిశాస్త్రి గారు
స్వాతి లో వ్రాసిన చిన్న చిన్న పిట్టకథలు ఒక్కొక్కటి ఒక్కో కవితలా అనిపించాయి
నాకు. మచ్చుకు రెండు.......
మహాత్మాగాంధీగారు మనకి
మరీమరీ
చెప్పిన మూడు చీనా
కోతుల్లోనూ,
ఒకటి పాపం చూడదు,
మరొకటి పాపపుమాట వినదు,
ఇంకొకటి పాపాన్ని
పలుకదు!!!!
బాగానే ఉంది, కానీ చిన్న
పేచీ ఉంది-
చూడనిది వినొచ్చు,
పలకొచ్చు,
విననిది చూడొచ్చు, పలకొచ్చు
పలకనిది కళ్ళారా చూడొచ్చు,
చెవులురిక్కించి వినొచ్చు.
పాపం చూడనిదీ, విననిదీ,
పలకనిదీ కూడా పాపం చెయ్యొచ్చు.
శ్రీ రాచకొండ
విశ్వనాధశాస్త్రి – స్వాతి, మార్చి 1979
పేదరికం కారణంగా చాలా జబ్బులు పుడతాయి- అనిచెప్పి,
ఓ రాజుగారు తన ఒక్కగాని ఒక్క కొడుక్కి
పేదవారి జబ్బులు తగలకుండా
ఆ కుర్రవాణ్ణి ఓ ఒంటిస్తంభం మేడలో ఉంచి పెంచాడు
కాని,
ఆ కుర్రవాణ్ణి కొంతకాలానికి పెద్దరోగం పట్టుకొంది
కారణం?
ఆ పిల్లడి పరిచారిక ఒంటిస్తంభం మేడలో పెరగలేదు
అయితే
కొందరే బాగుండడం కుదరదని రాజుగారికి తెలిసొచ్చిందా?
తెలిసింకా రాలేది అనుకుంటాను
శ్రీ రాచకొండ
విశ్వనాధశాస్త్రి – స్వాతి, ఫిబ్రవరి 1979
భవదీయుడు
బొల్లోజు బాబా
No comments:
Post a Comment