Friday, July 13, 2012

రావిశాస్త్రి కవితలు


రావిశాస్త్రిగారి రచనాసాగరం చదూతున్నాను.  చాలా బాగుంది.  మూడార్ల గూఢచారి పేరుతో రావిశాస్త్రి గారు స్వాతి లో వ్రాసిన చిన్న చిన్న పిట్టకథలు ఒక్కొక్కటి ఒక్కో కవితలా అనిపించాయి నాకు.  మచ్చుకు రెండు.......

మహాత్మాగాంధీగారు మనకి మరీమరీ
చెప్పిన మూడు చీనా కోతుల్లోనూ,
ఒకటి పాపం చూడదు,
మరొకటి పాపపుమాట వినదు,
ఇంకొకటి పాపాన్ని పలుకదు!!!!
బాగానే ఉంది, కానీ చిన్న పేచీ ఉంది-
చూడనిది వినొచ్చు, పలకొచ్చు,
విననిది చూడొచ్చు, పలకొచ్చు
పలకనిది కళ్ళారా చూడొచ్చు, చెవులురిక్కించి వినొచ్చు.
పాపం చూడనిదీ, విననిదీ, పలకనిదీ కూడా పాపం చెయ్యొచ్చు.

శ్రీ రాచకొండ విశ్వనాధశాస్త్రి – స్వాతి, మార్చి 1979


పేదరికం కారణంగా చాలా జబ్బులు పుడతాయి- అనిచెప్పి,
ఓ రాజుగారు తన ఒక్కగాని ఒక్క కొడుక్కి
పేదవారి జబ్బులు తగలకుండా
ఆ కుర్రవాణ్ణి ఓ ఒంటిస్తంభం మేడలో ఉంచి పెంచాడు
కాని,
ఆ కుర్రవాణ్ణి కొంతకాలానికి పెద్దరోగం పట్టుకొంది
కారణం?
ఆ పిల్లడి పరిచారిక ఒంటిస్తంభం మేడలో పెరగలేదు
అయితే
కొందరే బాగుండడం కుదరదని రాజుగారికి తెలిసొచ్చిందా?
తెలిసింకా రాలేదనే అనుకుంటాను

శ్రీ రాచకొండ విశ్వనాధశాస్త్రి – స్వాతి, ఫిబ్రవరి 1979
భవదీయుడు
బొల్లోజు బాబా

5 comments:

  1. katha kuda kavithala entha bhaagunnai andi,
    mee blog lo post choodatam ide modati saari,
    chaalaa kaalam tharuvatha post chesinatlunnaru, welcom sir.

    ReplyDelete
  2. రా.వి శాస్త్రి గారి కథలు, నాటకాలు (నిజం)..చదవండి ఇంకా బావుంటాయి..

    ReplyDelete
  3. రావిశాస్త్రి ఫిక్షను రచనల్లోనించి కొన్ని భాగాల్ని సంగ్రహించి దాన్ని కవిత్వ సంకలనంగా వెలువరించారు. దురదృష్టవశాత్తు వివరాలు గుర్తు లేవు. ఆయన రచనలో పోలికలు వింతగా, మునుపెన్నడూ ఊహించని విధంగా ఉంటాయి. మాటల పొందిక చక్కగా ఉండగా, మొత్తం అంతర్లీనంగా సాగే భావం గుండెని జలదరింప చేస్తుంది. మంచి కవితకుండాల్సిన లక్షణాలు అవేగా మరి!

    ReplyDelete
  4. సర్, వేయిపడగలు శాస్త్రి గారి రచనే కదా.
    ఆ శైలి ఇప్పుడు కానరాదు మచ్చుకైనా

    ReplyDelete
    Replies
    1. పడగలు ఆయనది కాదు

      Delete