Breakfast - by Jacques Prévert
నాతో
ఏమీ మాట్లాడకుండా
అతను
డికాక్షన్ ను
కప్
లోకి తీసుకొన్నాడు
అతను
ఆ కాఫీ కప్ లోకి
కొంచెం
పాలు ఒంపుకొన్నాడు
అతను
దానిలో
చక్కెర
వేసుకొని
ఒక
స్పూనుతో కలయతిప్పి
ఆ
వేడి café
au lait ని తాగి
కప్పు
టేబుల్ పై పెట్టాడు
నాతో
ఏమీ మాట్లాడకుండా
అతను
ఒక సిగరెట్ వెలిగించి
పొగను
రింగులుగా ఒదిలాడు
అతను
సిగరెట్ నుసిని
యాష్
ట్రే లోకి విదిలించాడు
నాతో
ఏమీ మాట్లాడకుండా
నన్ను
కనీసం చూడకుండా
అతను
లేచి
టోపీ
పెట్టుకొని
బయట
వర్షం వస్తున్నందున
రెయిన్
కోట్ వేసుకొని
వానలో
అలా నడుచుకొంటూ
వెళిపోయాడు
ఒక్క
మాటలేకుండా
నాకేసి
అసలు చూడకుండానే....
నేను,
నేను నా చేతుల్లో
మొఖం
పెట్టుకొని
ఏడుస్తూనే
ఉన్నాను.
ఫ్రెంచి కవి Jacques Prévert వ్రాసిన Breakfast (Déjeuner du matin) కు అనుసృజన
ఈ
కవితకు దృశ్యరూపాలు కొన్ని
యూట్యూబ్ లో ఉన్నాయి.
వాటి
లింకులు
పైకి
సాదా సీదాగా అనిపించినా ఈ
కవితలో ఏదో తెలియని శూన్యతను
పరాకాష్టకు చేర్చినట్టు
నాకనిపించింది.
రెండో
వీడియోలోని వ్యక్తులు ఇద్దరూ
మగవాళ్ళు అవ్వటం గమనార్హం
(కవితను
చదివినప్పుడు నాకొచ్చిన
సందేహం అదే.
ఇది
ఎవరిమధ్య జరిగిఉంటుంది అని)
తెలుగు
కవితలు కూడా ఇలా వీడియోల
రూపంలో కనిపించే రోజులు
ఎప్పటికైనా వస్తాయని ఆశిస్తూ
భవదీయుడు
బొల్లోజు
బాబా
చెప్పకుండా, మాట్లాడ కుండా ఉండడం శూన్యం గానే తోస్తుంది ..కదండీ.
ReplyDeleteఒకోసారి ఇది కవిత్వమా అనుకుంటారు.
అలాంటి సన్నివేశాన్ని నవ్యoగా చెప్ప గలగడం కవిత్వమే కదా!
కవిత్వాన్ని వీడియోలో చూడగల్గే..పరిణామక్రమం తెలుగు కవిత్వానికి ఉంటుందని ఆశాజనకంగా ఉంది. .
నేను, నేను నా చేతుల్లో
ReplyDeleteమొఖం పెట్టుకొని
ఏడుస్తూనే ఉన్నాను.
-- ultimate
ज़िन्दगी मिलेगी दुबारा చూసారా బాబా గారు? పూర్తిగా మీరన్నట్లుగా కాదు గానీ, దృశ్య చిత్రీకరణ తో పాటుగా వినవచ్చే కవితలు చాలా బాగున్నాయి. మీకూ నచ్చుతాయి. జావేద్ అక్తర్ మరో లోకాలకి తీసుకుపోతారు. ఈ కవిత లోని వర్ణనతో నాకు హిందీదే 'రెయిన్ కోట్', కవితలని దృశమాలికలుగా చూపితే అన్న మీ ఆకాంక్షతో తమిళానువాద చిత్రం 'ఇద్దరు' లోని కవిత "ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం..." కూడా గుర్తుకు వచ్చాయి. అనువాదం బావుందని అన్యాపదేశం గా అన్నది తెలిసే ఉండాలిక. :)
ReplyDeleteज़िन्दगी न मिलेगी दुबारा * పైన ఒక అక్షరం విడిపోయింది.
ReplyDeleteవనజగారు, ఫణి గారు, ఉషగారు థాంక్సండీ. ఉషగారు ఇద్దరులో కవితల పిక్చరైజేషన్ ఉంటుంది. నిజమే బాగుంటుంది. థాంక్యూ.
ReplyDeleteదృశ్య రూపాలు గురించి కూడా లింకులు ఉంచి మంచి సహాయం చేసారు బొల్లోజు బాబా గారు !
ReplyDeleteమీరు ఆశించిన వైబవం తెలుగు కవిత్వానికి దక్కుతుంది ......................
ధన్యవాదాలు
మీ కసి రాజు