Thursday, March 15, 2012

పోయిన శరత్తులో నీవెలా ఉన్నావో అలానే నాకు గుర్తు



పోయిన శరత్తులో నీవెలా ఉన్నావో అలానే నాకు గుర్తు
ఆకుపచ్చని టోపీతో....
ఒక నిశ్చల హృదయానివి.
నీ కళ్లల్లో వెన్నెల మంటలు కదం తొక్కేవి.
నీ ఆత్మజలాలపై ఆకులు రాలుతూండేవి.

నా చేతులపైకి ఎగబ్రాకుతోన్న ద్రాక్షతీగ ఆకులు
ఏమాత్రమూ ఆత్రములేని నీ ప్రశాంత స్వరాన్ని పీల్చుకొంటున్నాయి.

పారవశ్య జ్వాలలో నా దాహం దహింపబడింది
తీయని నీలి కలువ నా ఆత్మతో మెలికపడింది .

నీ నయనాలు దూరమయ్యాయి, శరత్తూ సుదూరంగా ఉంది.
నా ప్రగాఢ వాంఛలు
ఆకుపచ్చటోపీ వైపు,  పిట్టగానం వైపు, 
ఇల్లులాంటి హృదయంవైపు వలసపోయాయి.
నా ఉల్లాస చుంబనాలు బూడిదలా నేలరాలాయి.

కాంతిలో, పొగమంచులో, ప్రశాంత తటాకంలో
నువు నాకు గుర్తుకు వస్తున్నావు.

నీ కనులకు కనిపించనంత దూరంలో వెన్నెలలు కాలుతున్నాయి.
హృదయంలో శుష్కించిన శిశిర పత్రాలు  సుళ్లు తిరుగుతున్నాయి.

(Pablo Neruda - I Remember You As You Were  కవితకు స్వేచ్ఛానువాదం)
భవదీయుడు
బొల్లోజు బాబా 

4 comments:

  1. చాలా బాగా వ్రాశారండీ.. మీకు అభినందనలు..

    ReplyDelete
  2. Amu, how are you? Gurthunnana?

    -- Mahboob Hussain

    ReplyDelete
  3. hussain
    are you one from my intermediate batch? ఇంటర్ నెట్ లో నన్ను ఆమూ పిలిచేది నువ్వే. సందేహం లేదు.

    WHERE ARE YOU AND HOW ARE YOU? how can i forget you boss..
    only few days back ....సలాది నేనూ, ఫెర్రీ రోడ్ లో నడచుకొంటూ - అప్పట్లో మనందరం గుంపుగా ఫెర్రీకి వెళ్ళే సంగతి గుర్తుచేసుకొన్నాం.

    ప్లీజ్ MAIL ME AT
    bollojubaba@gmail.com

    విత్ లవ్
    ఆమూ

    రాజ్ గారికి అంతర్ముఖుడు గారికి థాంక్సండీ

    ReplyDelete