Sunday, October 9, 2011

దేహమూ - నీడా


సూర్యుని
వేడి రక్తపు చుక్కలు
నెర్రలు తీసిన భూమి చర్మం­­­­

చలి చీకటి తాగి
మెరుస్తూన్న
ఆకాశపుటిరుకు సందులు

గోడ గడియారం
మసిలో కూరుకుపోయింది

ఎంతవెతికినా
పురుగు చిక్కదు
వేకువ పక్షికి

పంజరం
పరిశుభ్రంగానే ఉంది కానీ
గుండెనిండా
లుకలుక లాడే మురికివాడలు


దేహం కన్నా
నీడే తెలివిగా ఉంది
ఈ బూడిద లోకాన్ని
నిత్యం సందేహిస్తుంది

రుధిర క్షణాలు
చలి శ్వాసకు గడ్డ కట్టాయి
అంతా నిశ్శబ్దం
లోకం నిద్దరోతుంది
దేహాన్ని నీడ కిడ్నాప్ చేసి
మృతుల దేశంలో దించేసింది

ఆ తరువాత.........



బొల్లోజు బాబా

3 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. కొత్త పాళీ has left a new comment on your post "దేహమూ - నీడా":

    "ఆకాశపుటిరుకు సందులు"
    ఇక్కడి దాకా "బ్రిలియంట్!" అనుకున్నా.
    గడియారం మసిలో కురుకుపోవడమెందుకో అర్ధంకాలే - బట్ వోకే! కవి సమయం అనుకున్నా. లుకలుకలాడ్డం దగ్గిర్నించీ మాత్రం ఇది బ్రిలియంట్ దగ్గర్నించీ మామూలుకి దిగిపోయి - sorry - it became rather pedestrian. Lost it's luminosity and became a mere shadow - methinks.
    Think about it!



    గురువు గారికి
    థాంక్యూ

    ఏమో మో లేని లోటు తీర్చేద్దామనుకొన్నానే మో సారూ
    సరదాగా

    బొల్లోజు బాబా
    పి.ఎస్. పొరపాటున మీ కామెంతు డిలిట్ అయిపోయింది. కనుక ఇలా పోస్ట్ చేస్తున్నాను

    ReplyDelete