Thursday, April 29, 2010

తపస్సు

చెట్ల ఆకులు
ధ్యాన ముద్రలో ఉన్నాయి
కొలను అలలు కూడా వాటిని
కలచ సాహసించటం లేదు
నీడ పొడలు నిశ్శబ్దంగా
తొంగిఛూస్తున్నాయి.
పరిమళాల సంచారం
నిలచిపోయింది.


నిశ్చల దృశ్యానికి
ఓ రికామీ తెమ్మెర
చక్కిలిగిలి పెట్టిపోయింది


పూలు అంతవరకూ బంధించిన
సుగంధాలు రివ్వున ఎగిసాయి.
కొలను అలలలలుగా తృళ్లిపడింది.
నీడపొడల అల్లరి
మళ్లీ మొదలైంది.


ఆకులు గలగలా నవ్వేసాయి
ధ్యానం ఫలించినందుకు


బొల్లోజు బాబా

5 comments:

  1. బాగుందండి !!

    ReplyDelete
  2. ఓ!!! ఇస్మాయిల్ గారు ఈ పేరుతో మళ్ళీ కవిత్వం రాస్తున్నారా??
    బొల్లోజుబాబా గారు అదేదే సినిమాలో ఆలీ మాటల్లో చెప్పాలంటే ‘టచ్’ చేసారండి బాబు,ఎన్నాళ్ళయ్యింది,ఇంతచక్కని,సుకుమార వర్ణన వినీ, చదివీ??
    ఈ సందర్భంగామీకొక మనవి.ఏమాత్రం వీలున్నా సంజీవ దేవ్,ఆచంట జానకిరామ్ గార్ల రచనలు చదవాలి మీరు.గతంలో చదివి ఉన్నా మళ్ళొక్కసారి చదవండి.

    ReplyDelete
  3. మీరు ఇంత మంచి కవిత్వం ఎలా ఇస్తున్నారో తెలుసా?కాకినాడ మహిమ...చాలా మంచి ఊరూ..మంచి మనుషులూనూ..రెండేళ్లు వున్నాఅక్కడ..ఏప్రిల్ 1 విడుదల 100 సార్లు చూసి వుంటా నేను..థీమ్ మ్యూజిక్ అధ్బుతమ్ ..లేడీస్ టేలర్ లానే..skml రెకార్డింగ్ ట్రాన్స్ ట్రూప్ వుంటుంది గదండీ...మీ ఇస్టమైన వాటిల్లో దాన్ని చేర్చ లేదు ఏమండీ??

    ReplyDelete
  4. బావుందండి, మనసు పదచిత్రాన్ని గీసుకుపోతుంటే, ఎవరో తలిస్తే ఒక్కసారిగా పొలమారినట్లు భావోద్వేగం ఎక్కిరిబిక్కిరైనంత బాగా!

    ReplyDelete