ఎవరు వింటారని ఈ అక్షరాలను
వెదురు రంద్రాల గుండా
ప్రవహింపచేస్తున్నాను!
ఎవరు చూస్తారని
ఈ భావాలకు రెక్కలు తొడిగి
నీలాకాశంలోకి ఎగరేస్తున్నాను!
ఎవని మనో యవనికపై
మొలకెత్తుతాయని
ఈ కవితా బీజాలను
రాల్చుకొంటున్నాను.
రాల్చుకొంటున్నాను.
ఏమో తెలీదు బహుసా
గాలికి పిట్టకి చెట్టుకీ
కూడా తెలీదేమో!
బొల్లోజు బాబా
బొల్లోజు బాబా
ఇంత చక్కగా వ్రాసి "ఏమో తెలియదు" అంటారా!!!:)
ReplyDeletevery nice
ReplyDeletenice baba gaaru...
ReplyDeleteవెదురు నుంచి వూపిరైన మీ మాట వొలికించిన రాగ సుధలు మాకు ఎరుకైనాయి.
ReplyDeleteనీలాకాశాన ఎగిరే భావనాంతరంగపు విహంగాల కుహు కుహు లు వినిపించాయి..
కవితా బీజాల చిగురు మొలకల పచ్చని ఆహ్లాద గీతాలూ వినిపించాయి.
ఇంకెవరికోసమనే ప్రశ్న కవి గారికి అవసరమా?
మీ కవితా పాదాల వెనక దాగిన ఆర్తి మనసును తాకింది.
ReplyDeleteఅవి చేరాల్సిన తీరాలే చేరతాయి. మునుపొకసారి నేనీ ప్రశ్నలు వేసుకుంటే అంతా ఇదే చెప్పారు. మనసు ఖాళీ చేసానెందుకు? http://maruvam.blogspot.com/2009/05/blog-post_24.html
ReplyDeleteకవిత బావుంది. భావ వ్యక్తీకరణ బావుంది. కాని కొన్ని సూచనలు : ఎవని అనే కంటే ఎవరి అనీ, బహుసా అనే కంటే బహుశా అంటే ఇంకా బాగుంటుందేమో !
ReplyDeleteనాగరాజు గారికి
ReplyDeleteసవరించినందుకు ధన్యవాదములు. బహుశా కరక్టు. బహుసా తప్పు. ఒకని బదులుగా ఒకరు అనిఉన్నట్లయితే మరింత బాగుంటుంది. సున్నితంగా చెప్పినందుకు ధన్యవాదములు. :-)
థాంక్యూ
బొల్లోజు బాబా
అద్భుతం !
ReplyDeleteసున్నితంగా చెబితే ’ధన్యవాదాలు’ చెబుతారా. అలాగైతే సరే :)
ReplyDelete