Thursday, December 29, 2011

వస్తావా?


చీకటి దుప్పట్లో దూరి
దేహ దీపాల్ని
వెలిగించుకొందాం     
రాత్రి హార్మోనియంపై 
మోహపరిమళాల రాగాల్ని పలికిద్దాం
శీతవేళకు చిక్కకుండా
వేడి శ్వాసల్ని కప్పుకొందాం

ఒక సమాంతర కాలంలోకి
అనంతంగా ప్రవహిద్దాం
వస్తావా!

బొల్లోజు బాబా

7 comments:

 1. hmmmm...chaalaa baagunthi

  ReplyDelete
 2. The title of your poem is too pale. It should be something like 'Kindling the night'. That appeal in the end spoils the spirit of the poem... Its more like an invitation to seduction than an engagement in experience.

  ReplyDelete
 3. చాలా బాగుందండి...

  ReplyDelete
 4. చాలా రోజులనుంచి కలుద్దామనుకుంతున్నాను కానీ కుదరలేదు
  ఈవిధంగా ఇక్కడ కలుస్తున్నందుకు ఆనందంగా వుంది ,చాలా బాగుందండి

  ReplyDelete
 5. కామెంటిన అందరికీ ధన్యవాదములు
  తెలుగుఅనువాదాలు/అనువాదలహరి బ్లాగు ను నిర్వహించే శ్రీ నండూరి సూర్యనారాయణ మూర్తి గారికి (sunamu)విశ్లేషణకు ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

  తెలుగునుంచి ఇంగ్లీషులోకి ఇంగ్లీషునుంచి తెలుగులోకి కవిత్వానువాదాలు అత్యంత ప్రతిభావంతంగా చేయగలిగే అతికొద్దిమందిలో వీరు ముందువరుసలో ఉంటారు. మూలం లోని టోన్ ని పట్టుకొని దాన్ని లాఘవంగా మరో భాషలోకి పునర్జన్మింపచేయటం ఒక తపస్సు. ఒక భాష లోని సాహిత్యం ఎల్లలను దాటాలంటే అనువాదం అవసరం ఎంతైనా ఉంటుంది. తెలుగు సాహితీలోకానికి వీరు చేస్తున్న కృషికి అభినందనలు తెలుపుతూ పై కవితపై వారికీ నాకు మధ్య జరిగిన సంభాషణను కామెంటు రూపంలో పోస్ట్ చేస్తున్నాను. (దీనిలో వారి ఆత్మీయతను అదే సమయంలో విమర్శనా వస్తువుపై సాధికారికంగా చేసే వ్యాఖ్యానాన్ని గమనించగలరు)  మూర్తిగారికి

  నమస్తే

  మంచి లోతైన విశ్లేషణాత్మక వ్యాఖ్యకు థాంక్యూ సార్

  ఇక కవిత గురించి.

  Yes.

  What I meant in the poem is an invitation for seduction only. Of course not in the real sense for sex.(????). When I tried to remove some words like మోహ పరిమళాలు మరియు వేడి శ్వాసలు the poem appeared to be more paler to me sir. మీరన్నట్లు ఒక దివ్యానుభూతి కొరకు ఆహ్వానం లా అనిపించటానికి ఈ కవితకు అర్హతలేదనిపిస్తూంది. No regrets. శృంగారాహ్వానం కూడా ఒక ప్రయోగమే కదా అని సరిపెట్టుకొంటున్నాను.

  మరోసారి మీ నిశితమైన వ్యాఖ్యకు ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను. వ్యాఖ్యలనేవి నన్ను నేను మెరుగుపరచుకోవటానికేనని నమ్ముతూ

  భవదీయుడు

  బొల్లోజు బాబా


  Dear Babagaru,

  Thank you in the first place for taking the criticism in the right spirit.

  I don't think that you have any doubt about my respect for you and your work. As a friend I thought it is my utmost duty to say what i feel about the poem. When I read it, except for the Title and the last line "vastaava?"... it was really a good poetic experience. I really enjoyed reading it. There is nothing wrong in expressing sex through poetry. In fact, Bertrand Russel had said that all creative activity is an expression of sex.

  But then, poetry should unveil, as Tilak said, the inmost florescent fertile plateaus and the pulchritudes; and should not pale out in platitudes. "Vastaavaa" is too mundane and nearer to vulgarity.

  See what KaruNaSree has said in his poem :

  ".......................................... ......................నవ్యజీ
  వన బృందార వనాంత సీమ విహరించన్ రమ్ము నే కొల్ల గొం
  దును నీ కోమల బాహు బంధనములన్ కోటి స్వర్గమ్ములన్".

  ఆయన చెప్పినదీ అదే. కాని కొంచెం Polished గ చెప్పాడు. ఆ ఉద్దేశ్యం తో మీరు శీర్షిక మారిస్తే బాగుంటుందన్న సలహా ఇచ్చేను... కొంచెం స్వతంత్రం తీసుకుని.
  అయినప్పటికీ ఇది మంచి కవితే. ఇంక ఏ మాటా తియ్యనవసరం నాకు కనిపించ లేదు. అన్యధా భావించ వద్దు.
  అభివాదములతో,
  మూర్తి.

  భవదీయుడు
  బొల్లోజు బాబా

  ReplyDelete
 6. బాబా గారూ,మీ కవితలు చదవడం మానలేదు గానీ, ఇదివరకు లా శ్రద్ధగా , ఆ కవిత్వాన్ని అనుభవిస్తూ కామెంట్ రాయడాంకి మాత్రం తగినంత సమయం ఉండటం లేదు.క్షమించాలి నన్ను!


  రాత్రి హార్మోనియంపై
  మోహపరిమళాల రాగాల్ని పలికిద్దాం
  శీతవేళకు చిక్కకుండా
  వేడి శ్వాసల్ని కప్పుకొందాం

  అతి మామూలు పదాల్లో ఇంత సౌందర్యం మీకే సాధ్యం!

  ReplyDelete