Friday, December 26, 2025
plugged in....
చార్జింగ్ కేబుల్
పాములాగ వంగి
బొడ్డుతాడులా
అందరినీ ఈ డిజిటల్ లోకానికి
కట్టిపడేసింది.
అది విద్యుత్ నే కాదు
జీవితాన్ని కూడా
సస్టైన్డ్ రిలీజ్ డ్రగ్ లా
కొద్దికొద్దిగా
నరాల్లోకి పంపుతోంది.
పూర్తిగా చావనివ్వదు,
పూర్తిగా బ్రతకనివ్వదు.
బొల్లోజు బాబా
ప్రాచీనగాథల గురించి ….
ప్రాచీన గాథలు పుస్తకం విడుదలై ఏడాది కావొస్తుంది. సుమారు 500 పైగా ప్రాకృత, తమిళ, సంస్కృత పురాగాథల అనువాద సంపుటి ఇది. “సంగం కవిత్వం” ఈ పుస్తకంలో మొదటి చాప్టరు. నాకెంతో ఇష్టమైన చాప్టరు. పుస్తకంలో సుమారు 100 వరకూ సంగం కవితలు ఉన్నాయి.
సంగం కవిత్వంలో నాకు నచ్చిన ఒక గొప్ప కవిత ఇది.
55
పండగ రోజులు సమీపించాయి
భార్య ప్రసవవేదనలో ఉంది
వర్షం వల్ల పెందలాడనే చీకటి కమ్మేసింది
ఆమెకు సహాయం చేయటానికి
తొందరగా ఇంటికి వెళ్ళాలి ఆ చర్మకారుడు
బొంతను కుడుతున్న అతని చేతివేళ్ళ మధ్య సూది -
పట్టణాన్ని జయించటానికి వచ్చిన శత్రువుతో
ద్వంద్వయుద్ధంలో పోరాడుతున్న రాజు మెడలోని
దేవకాంచన పూలమాల కన్నా
వడిగా, కోమలంగా కదులుతోంది
Purananuru 82
(Perunarkilli అనే చోళరాజుకు Amur Mallan కు జరిగిన మల్లయుద్ధం ఈ గాథాసందర్భం)
.
బొంతను కుట్టే చర్మకారుని పని, పట్టణాన్ని కాపాడేందుకు ఒక రాజు చేస్తున్న పోరాటాన్ని ఒకే తలంపై నిలబెడతాడు ఈ గాథాకారుడు. రాజు చేసే యుద్ధం ఎంత విలువైనదో చర్మకారుని పని కూడా అంతే గౌరవనీయమని కవి చెబుతున్నాడు. మానవ విలువలు వృత్తితో నిర్ణయించబడవు అన్న భావన ఎంత ఉదాత్తమైనది. వర్ణ వ్యవస్థ, పురుషాధిక్యత ఇంకా కబళించని కాలమది.
అంతే కాక అప్పట్లో ప్రాణనష్టం నివారించటానికి ఇరురాజులు ద్వంధ్వ యుద్ధం ద్వారా జయాపజయాలను నిర్ణయించుకొనేవారనే చారిత్రక సత్యం కూడా ఈ గాథలో పొందుపరచబడింది.
***
పుస్తకం చివర ఆయా గాథల చారిత్రక నేపథ్యం చెప్పే నోట్సులో సంగం కవిత్వ సమాచారం ఇది.
ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో ఛాయా వారి స్టాల్స్ 178 నందు లభిస్తుంది. మొదటి కామెంటులో ఇచ్చిన అమజాన్ లింక్ లో కూడా దొరుకుతుంది.
***
సంగం కవిత్వం నోట్సు
.
సంగం కవిత్వం, 300 BCE నుండి 300 CE మధ్య రచింపబడిన తమిళ సాహిత్యం. ఇంతవరకూ లభించిన సంగం కవిత్వం సుమారు 473 మంది కవులు రచించిన 30 వేల పాదాలున్న 2381 కవితలు. ఈ 473 మంది కవులలో 103 మంది అజ్ఞాతకవులు. కపిలర్ కవి పేరుతో అత్యధికంగా 235 గాథలు ఉన్నాయి. సంగం కవిత్వంలో రెండు సంప్రదాయాలున్నాయి. ఒకటి అకం` ప్రేమ, మానవోద్వేగాలను వర్ణించే భాగం, రెండు పురం- రాజకీయాలు, యుద్ధాలను ప్రతిబింబించే భాగం. ఈ సాహిత్యంలో వేటగాళ్ళు, రైతులు, నావికులు మత్స్యకారులు, కుమ్మరులు, గొల్లలు, వర్తకులు, గాయకులు, కమ్మరులు, సైనికులు లాంటి దిగువతరగతి కుటుంబాలకు చెందిన సామాన్య వ్యక్తులే ప్రధాన పాత్రలు. కులీనుల జీవిత చిత్రణ అరుదు.
తెలుగు తమిళాలు ఒకే రకమైన మూలాలను, సంస్కృతిని పంచుకొన్నప్పటికీ తెలుగు తమిళవారసత్వాన్ని కాక, సంస్కృత కావ్య వారసత్వాన్ని అందిపుచ్చుకోవటం వల్ల, ప్రాచీనమైన ఉమ్మడి తమిళ, ప్రాకృత మూలాలకు దూరం జరిగిపోయింది. నన్నయకు పూర్వం తెలుగు సాహిత్యం ఉండేదని అరకొర ఆధారాలు లభిస్తాయి తప్ప బలమైన ఋజువులు లేవు. సంగం సాహిత్యానికి తొలి తెలుగు సాహిత్యానికి మధ్య సుమారు వెయ్యేళ్ల వ్యత్యాసం ఎందుకు ఉందనే ప్రశ్న విలువైనది.
‘‘సంగం సాహిత్యం ఎక్కువగా జైన, బౌద్ధ విశ్వాసాలకు సంబంధించినది. ఆ తరువాత కాలంలో వచ్చిన శైవ వైష్ణవ సంప్రదాయ పండితులు ప్రోత్సహించని కారణంగా సంగం సాహిత్యం చాన్నాళ్ళు గుప్తంగా ఉండిపోయింది’’ అని Poems of Love and War పేరుతో వెలువరించిన సంగం సాహిత్య అనువాదరచనకు రాసిన ముందుమాటలో శ్రీ A.K. Ramanujan అన్నారు.
ఈ పని తెలుగునాట కూడా జరిగి ఉంటుంది. నన్నయపూర్వ ప్రాకృత లేదా ప్రాచీన తెలుగు సాహిత్యం ఎక్కువగా జైన, బౌద్ధ విశ్వాసాలకు సంబంధించినదనే కారణంతో సంప్రదాయ పండితులు దాన్ని తగలపెట్టి ఉంటారు. ఇదే అభిప్రాయాన్ని శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్ళపల్లి వారి గాథాసప్తశతి తొలి తెలుగు అనువాద రచన తొలిముద్రణ (1931) ముందుమాటలో చెప్పారు. సంగం సాహిత్య వారసత్వాన్ని రెండువేల సంవత్సరాల పాటు అటకలపై దాచుకొని, మఠాలలో భద్రపరచుకొని నిలబెట్టుకొన్నారు తమిళులు. తెలుగునేలపై అలాంటి పని జరిగినట్లు లేదు. బ్రాహ్మణిజపు విలువల్ని స్థాపించే మహాభారత కావ్యానువాద రచన చేసిన నన్నయను తెలుగుభాషకు ‘ఆదికవి’ గా ప్రతిష్ఠించుకోవలసి వచ్చింది.
***
ప్రాచీనతమిళ సమాజాన్ని, సంస్కృతిని అర్ధం చేసుకొనటానికి సంగం సాహిత్యం ఎంతో దోహదపడుతుంది. ప్రేమ, రాజ్యపాలన, యుద్ధం, నీతి, రాజకీయాలు, ప్రకృతి, సామాన్యప్రజల జీవనం వంటి అనేక జీవితకోణాలను ఈ సాహిత్యం ఆవిష్కరిస్తుంది. సంగం కాలం తరువాత శైవ నాయనార్ల, వైష్ణవ ఆళ్వార్ల సాహిత్యం ప్రసిద్ధి చెందింది.
సంగం కవిత్వంలో ప్రముఖమైనది ఎట్టుతొగై. ఇది ఎనిమిది సంకలనాల సముదాయం. అవి Ainkurunuru, Akananuru, Purananuru, Kalittokai, Kuruntokai, Natrinai, Paripadal, Patirruppattu.
ఈ ప్రాచీన కావ్యాలను వెలుగులోకి తెచ్చింది శ్రీ సామినాథ అయ్యర్ (1855-1942). తమిళ సంగం సాహిత్యం పునరుజ్జీవనం కొరకు ఇతను ఊరూరు తిరుగుతూ, మఠాలను సందర్శిస్తూ, అటకలపై దాచిన తాళపత్ర గ్రంథాలను సేకరిస్తూ, వాటిని పరిష్కరించి పుస్తకరూపంలో ప్రచురించటానికై తన యావజ్జీవితాన్ని వెచ్చించాడు. దాదాపు కనుమరుగైపోయిన ఒక విస్మృత సారస్వతాన్ని తిరిగి బతికించి ప్రచారంలోకి తీసుకొని వచ్చాడు.
1877లో ఎట్టుతొగై మొదటి ముద్రణకు రాసిన ముందుమాటలోని ఈ వాక్యాలు ఒక చారిత్రిక సందర్భాన్ని నమోదు చేస్తాయి
‘‘నిప్పు, నీరుల నుండి తప్పించుకొన్నవి మాత్రమే నిలిచాయి. వాటిలోకూడా చెదపురుగుల బారినబడి మిగిలినవి కొన్నే.... ముడి విప్పితే తాటిఆకులు పికిలిపోతాయి, ఆకు తిప్పితే అది మధ్యకు విరిగిపోతుంది.... పాత రాత ప్రతులు పొడుం పొడుం అయ్యాయి, వాటికి ఎవరూ పుత్రికలను పుట్టించలేకపోయారు’’
ఆ విధంగా వెలుగు చూసిన సంగం సాహిత్యం భారతీయ సాహిత్యచరిత్రలో గొప్ప స్థానాన్ని పొందింది. సంగం సాహిత్యం ఆర్యసంస్కృతి ప్రభావం దక్షిణ భారతదేశంపై ఇంకా పడని కాలంలో రచించబడటం వల్ల, వైదిక దేవతలు, ఆచారాలు, సంస్కృత పదాలు, పురుషాధిక్యత, వర్ణవ్యవస్థ లాంటివి కనిపించవు. ఆ విధంగా సంగం సాహిత్యపు చారిత్రికత ఎంతో విలువైనది. ఇది తమిళుల ఇంకా చెప్పాలంటే దక్షిణ భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించే సాహిత్యం.
ఈ గాథలు అనువదించడానికి Sri. A.K. Ramanujan, Sri. M.L. Thangappa, Prof. S.M. Ponniah వంటి ప్రముఖుల అనువాదాలు దారిచూపాయి.
.
(ప్రాచీన గాథలు పుస్తకం హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో ఛాయా వారి స్టాల్ 178 నందు లభిస్తుంది. లేదా మొదటి కామెంటులో అమజాన్ లింక్ కలదు)

కొండలకూ తప్పని SIR....
కోట్ల ఏళ్ళ
ఆరావళి పర్వతశ్రేణి
భూమికి శ్వాస
వానకు గొడుగు
ఎడారికి అడ్డుగోడ
ఢిల్లీకి ఊపిరి
రాజస్థాన్ కు నీడ
నదీజలాలకు జనని
నేడు మేప్ లో
గీతలు మారుతున్నాయి
క్రోనీ కేపిటలిజపు మృగం
లాభాల దాహంతో
కొండల ఛాతీపై
గనుల గాయాలు చేస్తూ
పచ్చని అడవులపై
జూలు విదుల్చుకొని దుముకుతోంది
దాని బుల్డోజర్ విధ్వంసానికి
కొండలు కూడా క్యూలో నిలబడి
తమ అస్తిత్వాన్నే కాదు
తమ పౌరసత్వాన్నీ నిరూపించుకోవాల్సిన
రోజులు వచ్చాయి.
బొల్లోజు బాబా
Subscribe to:
Comments (Atom)