Thursday, August 31, 2023

కృప


ఈ ప్రపంచం నన్నేనాడూ
నిరాశపరచలేదు
నాకు అర్హమైనవి ఏవీ
నాకు ఇవ్వకుండా లేదు

కొన్ని సూర్యోదయాలు
ఇంకొన్ని కిలకిలారావాలు
గుర్తుండిపోయే ముద్దులు
మర్చిపోలేని స్నేహాలు
చెరువులో మౌనంగా కదిలే అలలు
ఏటిఒడ్డుపై గాలికి ఊగే రెల్లుపూలు
రాత్రిపూట నింగినుండి రాలే ఉల్కాపాతాలు
ఎండవేళ దొరికిన చెట్టునీడ
జాతరలో కనిపించిన పాత మొఖం
దారిమలుపులో నాకై నిరీక్షించిన నేత్రాలు
సొట్టబుగ్గల చిన్నారి నవ్వులు
నుదిటిపై చల్లని చేయి
గుండెలపై వెచ్చని శ్వాస
ఎన్నెన్ని ఆనందాలు!

ఈ ప్రపంచం
ఏనాడూ నా ఆత్మని, అస్తిత్వాన్ని
అమ్ముకోమని చెప్పలేదు

ఇంతటి అనిబద్ద ప్రేమ
కృపకాక మరేమిటి?


బొల్లోజు బాబా

2 comments:

  1. యు ఆర్ వెరి వెరి లకీ

    ఆనందాలెన్నెన్నో!
    యేనాడై న అది ఆత్మ ని పణముగా కో
    రేనా ?లే! కృప కురిపిం
    చేనెప్పటికిన్ ప్రపంచమే నా పైనన్

    జిలేబి

    ReplyDelete