Thursday, January 25, 2018

చివరి విందు - The Last Toast - Poem by Nicanor Parra

చివరి విందు - The Last Toast - Poem by Nicanor Parra
మనకు ఇష్టమున్నా లేకున్నా
మూడు చాయిస్ లు మాత్రమే ఉన్నాయి
నిన్న నేడు రేపు
మూడు కూడా కాదు
ఎందుకంటే ఒక వేదాంతి అన్నట్టు
నిన్న అనేది నిన్నే
ఒఠి జ్ఞాపకాలలో మాత్రమే అది మనది:
రేకలన్నీ తుంచబడ్డ గులాబీ నుంచి
కొత్తగా ఏ రేకల్నీ పెరకలేం
ఆడేందుకు రెండు పేకముక్కలు
మాత్రమే ఉన్నాయి
వర్తమానము భవిష్యత్తు
ఇంకా చెప్పాలంటే రెండు కూడా లేవు
గతానికి దగ్గరగా వెళ్ళిందా
వర్తమానమూ లేనట్టే
కరిగిపోతుంది
యవ్వనంలా
చివరకు
రేపు ఒక్కటే మిగిలుంది మనకు.
నేను మధుపాత్రను పైకెత్తి
కోరుకొంటున్నాను
ఎన్నటికీ రాని రోజుకు జయం కలగాలని.
మనకు మిగిలుంది అది మాత్రమే.
అనువాదం: బొల్లోజు బాబా
Source: Last Toast - Poem by Nicanor Parra

5 comments:




  1. రేపేదో వుందనుకో
    కూ! పాతదినీది కాదు కొకబికగా నే
    డూ బాకీ లేదోయి జి
    లేబీ ! మధుపాత్రహొ మిగిలిందదొకటహో !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నైస్ ఎక్స్టెన్షన్ అండీ

      Delete
  2. రెండు పాదాలు దాటగానే - ప్రాసభంగపడిందండీ. మధుపాత్ర మహిమ అనుకుంటా :)

    ReplyDelete
    Replies


    1. ఊకదంపుడు గారు మరీ రిప్ వాన్ వింకల్ గా వున్నారు :)



      జిలేబి

      Delete


  3. రేపేదో వుందనుకో
    కూ! పాతదినీది కాదు కొత్తది లేదోయ్
    పీపాలే మధు పాత్రలు
    తాపీ గా తాగు మనసు తరియింప వలెన్


    జిలేబి

    ReplyDelete