Tuesday, December 5, 2017

ఫ్రాగ్మెంట్స్


1.
కొత్తవిలువలతో
వ్యామోహాలతో
ఆక్రమింపబడిన కాలమిది
దేహాలలో పాల బదులు
ఇనుప గుప్పెళ్ళతో పూలను పిండి
వండిన అత్తరు ప్రవహిస్తోంది
2.
నీవు వెళ్ళిపోయాకా
ఈ దేహం నిర్జీవ నెమలీకలా ఉంది
నడివేసవిలో వడగాలిలా ఒంటరిగా
వీధులలో సంచరిస్తోంది
3.
ఎంతో స్వచ్చంగా బోసి నవ్వులతో
ఇక్కడికి వస్తాం
మురికి మురికిగా మారి
ఏడుస్తూ నిష్క్రమిస్తాం
4.
కాలం అప్పుడప్పుడూ కాసేపాగి
తన సెల్ఫీ తానే తీసుకొంటోంది
ఒక్కో ఫొటో
రక్తమూ కన్నీళ్ళు నింపుకొన్న
కవిత్వమై చరిత్రలోకి ఇంకిపోతోంది
5.
ఓ రాజకీయనాయకుడు
రెండువేళ్ళూ పైకెత్తి గాల్లో
అటూ ఇటూ ఊపుతున్నాడు
ఎవరి విజయమో తెలియని
వెర్రిజనం కూడా ఊపుతున్నారు
బొల్లోజు బాబా

3 comments:

  1. కాలం అప్పుడప్పుడూ కాసేపాగి తన సెల్ఫీ తానే తీసుకొంటోంది
    ఒక్కో ఫొటో రక్తమూ కన్నీళ్ళు నింపుకొన్న కవిత్వమై చరిత్రలోకి ఇంకిపోతోంది...మనసులో గుర్తుండిపోయే వాక్యాలు.

    ReplyDelete
  2. dear sir good poetry and you very good blog
    Telugu Cinema News

    ReplyDelete