Thursday, December 17, 2015

దాహం



భూమిలోంచి పైకి లేచిన కుళాయి గొట్టం
ఒంపు తిరిగి పిట్టగోడను అనుసరిస్తూ సాగి
మరో రెండు మలుపులు తీస్కొని
ఇత్తడి టాప్ నేత్రమై
ఏ మేఘసందేశాన్నో నీళ్ళ భాషలో అందిస్తుంది
బహు జాగ్రత్తగా!

పుస్తకమూ అంతే
ఎన్నో మలుపులు తీసుకొని చేతిలోకి చేరి
ఒకనాటి  మనో ఆకాశపు వానచినుకుల్ని
అక్షరాలుగా  వర్షింపచేస్తుంది
మట్టి నయనాలపై
బహు వేడుకగా!


బొల్లోజు బాబా

5 comments:

  1. Replies
    1. డియర్ అనోన్, థాంక్యూ

      Delete
  2. బబా గారు
    కవిత చలా బాగుంది
    కొలయికి పుస్తకానికి చూపిన పొలిక నాకు ఎంతగానో నచింది

    ReplyDelete