ఏమీ గుర్తు లేవిపుడు
జేబుడు సూర్యకిరణాలు
గుప్పెడు చందమామ
ముక్కలు తప్ప.
దుఃఖాశ్రువులు నిండిన
సాయింత్రాన్ని
రాత్రి రెప్పల క్రింద
నిదురపుచ్చి అన్నీ
మరచిపోదామనుకొంటాను
కానీ
కొన్ని పదాలు నా నుండి రాలిపడి
ఓ ఎడారిని సృష్టిస్తాయి
ఆ ఎడారిలోంచి ఓ అరణ్యము
ఆ అరణ్యం లోంచి కుంభవృష్టీ
ఒక్కొక్కటిగా విచ్చుకొని
నన్ను కబళిస్తాయి.
నానుంచి పుట్టినదైనా
నన్నో పూచికపుల్లను చేసి
కొట్టుకొని పోతుంది
ఏమీ గుర్తులేవిపుడు
జేబుడు పదాలు
గుప్పెడు కలల
ముక్కలు తప్ప
బొల్లోజు బాబా
చాలా abstract గా ఉంది
ReplyDeleteదాని వల్లే అందం వచ్చినట్టు ఉంది
"కలల శకలాలు" దుష్ట సమాసమా ?
ఎందుకో అది తట్టింది చదువుతుంటే
జేబుడు పదాలు,గుప్పెడు కలలముక్కలు కవనంలో కలగలిసి నైరూప్య తైలవర్ణచిత్రమైంది!
ReplyDeleteవాసు గారికి, కలల శకలాలు దుష్ట సమాసం కాదేమో, తెలుగు పదం తరువాత సంస్కృతపదం వస్తే కొంతమంది తప్పు కాదంటారు. ధన్యవాదాలండీ
ReplyDeleteసూర్యప్రకాష్ గారికి థాంక్యూ సర్.
ReplyDeleteకవిత ఆరంభమే చాలా చాలా బావుంది బాబా గారూ!!
"...నానుంచి పుట్టినదైనా
నన్నో పూచికపుల్లను చేసి
కొట్టుకొని పోతుంది..." -- వావ్!
కలల శకలాలు is okay
ReplyDeleteOpening stanza is brilliant.
I got the feeling the rest of the poem did not justify it.
నిషిగంధ గారికి థాంక్యూ అండి
ReplyDeleteనారాయణ స్వామి గారికి
థాంక్యూ సార్
జస్టిఫికేషన్ కొరకే చివరిపాదాలు అని మీకు అర్ధం అయ్యేఉంటుందనుకొంటాను :-)
avunu sir , sahitya priyulaku kavalasina popkarn adygaa ? kavitha chaalaa bagundy
ReplyDeleteనాకు చివరి మాట అర్థం కాలేదు అండి "బొల్లోజు బాబా" అంటే ఏంటి .. నాకు తెలీనవి తెలుస్కుందామని అడుగుతున్నాను ఇది కూడా తెలీద అనుకోకుండా నాకు చెప్పండి
ReplyDeleteఓహ్ అది మీ పేరా అండి
Deletesuper rasaramdi
ReplyDeletehttps://abhilyrics.com/