Saturday, November 6, 2010

ఫ్రెంచి పాలనలో యానాం..... 2


స్పందించి మరలా నన్ను బ్లాగ్లోకంలోకి ఆహ్వానించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

తెలుగులో స్థానిక చరిత్రల వెలికితీత “లోకలిస్టు” బంగొరె అస్తమయంతో కుంటుపడిందనే నా అభిప్రాయం. ఈ రచనను చదివిన నా మిత్రుడు (మంచి అభిరుచికలిగినవాడే) “చరిత్ర ఎవరికి కావాలండీ- ప్రపంచం జెట్టుస్పీడుతో ముందుకు పోతున్న ఈ కాలంలో” అని పెదవి విరిచాడు. యానానికి సంబంధించి ఇక్కడి చరిత్ర ఒక్క  స్థానీయమే కాక అంతర్జాతీయ ప్రభావితమని అనిపిస్తుంది

 జనజీవన స్రవంతిలో కలవటం ఆనందంగానే ఉంది కానీ రోజు సుమారు ఆరుగంటల ప్రయాణం ప్రాణాల్ని హరించివేస్తుంది. ఫామిలీ షిఫ్ట్ చేసాక కానీ పూర్తిగా రీజువునేట్ కాలేనేమో.
మరలా కలుద్దాం
పి.ఎస్. ఈ వ్యాసాల ప్రింటులో అనేక ముద్రారాక్షసాలు, వాక్యాల మిస్సింగులు ఉన్నాయి. ప్లీజ్ బియర్
భవదీయుడు
బొల్లోజు బాబా

Thursday, November 4, 2010

ఫ్రెంచి పాలనలో యానాం.....

చాలా కాలం గాప్ తరువాత మరలా .......
ఈ విరామ సమయంలో ఎంతో ఆత్మీయంగా నా క్షేమాన్ని విచారించిన అఫ్సర్ గారికి, కత్తి మహేష్ గారికి, చైతన్య గారికి ఇతర మిత్రులకు సదా కృతజ్ఞుడను.


ఈ మధ్య నూతన గృహప్రవేశం, ఆ వెంటనే దూర ప్రాంతానికి ప్రమోషనుమీద (డిగ్రీ కాలేజీ లెక్చరరుగా) బదిలీ కావటం, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక సంవత్సర కాలంగా ఎంతో శ్రమనోడ్చి రచించిన " ఫ్రెంచి పాలనలో యానాం" అనే పుస్తకాన్ని తుది రూపానికి తీసుకురావటం ..... వంటివన్నీ నా ఈ బ్లాగు విరామానికి కారణాలే.

 " ఫ్రెంచి పాలనలో యానాం"  అనే పుస్తకంలో ఫ్రెంచివారు ౧౭౨౩ లో యానాంలో ప్రవేశించిన నాటినుండి ౧౯౫౪ లో యానాన్ని విడిచివెళ్ళేవరకూ జరిగిన అనేకానేక సంఘటనలు, విశేషాలు ఉంటాయి.

ఈ కాలంలో జరిగిన వాణిజ్యం, యానాన్ని పాలించిన ఫ్రెంచి అధికారులు (పెద్దొరలు), ఇక్కడ ఉన్న ఫ్రెంచి సమాధులలోని వ్యక్తుల వివరాలు, అనాటి విద్యావిధానం, రాజకీయ చిత్రణ, యానాంలో జరిగిన బానిస వ్యాపారం, ఆనాటి సాహితీవేత్తలు, సామాజిక వ్యవస్థ, ప్రకృతి భీభత్సాలు, ఫ్రెంచివారు యానాంలో చేసిన పబ్లిక్ వర్క్ లు, అప్పటి జ్యుడిషియల్ వ్యవస్థ, బాల్య వివాహాలు వంటి వివిధ అంశాలతో కూడుకొన్న వ్యాసాలతో (ఒక్కొక్కటి మూడునుంచి ముప్పై పేజీల మధ్య మొత్తం నూటయాభై పేజీలు) ఈ పుస్తకం ఉంటుంది.  దీని రచనకొరకు సుమారు ఓ రెండువేల డాక్యుమెంట్లను పరిశోధించవలసి వచ్చిందనటం అతిశయోక్తికాదు. (ఎక్కువ శాతం ఫ్రెంచి లో ఉన్నవి- ఈ సందర్భంలో గూగుల్ ట్రాన్స్ లేటర్ ఎంతగానో ఉపయోగపడింది. మాచవరం మాధవగారు, బులుసు చైతన్య, కె. క్యూబ్ వర్మ గారికి ధన్యవాదాలు)

వీటిని ప్రస్తుతం ’జనమిత్ర’ అనే ఒక స్థానిక పత్రికలో సీరియల్ గా వెలువరించటం జరుగుతున్నది. త్వరలో పుస్తకరూపంలోకి తీసుకు రావాలని ఉంది.

బొల్లోజు బాబా